చిత్రం: మృగరాజు (2001)
రచన: చంద్రబోస్
గానం: చిరంజీవి
సంగీతం: మణి శర్మ
పల్లవి :
ఏ ఛాయ్ చాయ్ చటుక్కున తాగరా భాయ్
ఈ ఛాయ్ చమక్కులే చూడరా భాయ్
ఏ ఛాయ్ ఖరీదులో చీపురా భాయ్,
ఈ ఛాయ్ ఖుషీలనే చూపురా భాయ్
ఏ ఛాయ్ గరీబుకు విందురా భాయ్
ఈ ఛాయ్ నవాబుకి బంధువే నోయ్
ఏ ఛాయ్ మనస్సుకీ మందురా భాయ్ ఈ ఛాయ్ గలాసుకీ జై జై ఏ ఛాయ్ చాయ్ చటుక్కున తాగరా భాయ్
చరణం 1 : డ్రైవర్ బాబులకూ ఈ ఛాయ్ పెట్రోలు
డాక్టర్ బాబులకూ ఈ ఛాయే టానిక్కూ
లేబర్ అన్నలకూ టీనీళ్ళే తీర్ధాలు,
విద్యార్ధుల చదువులకు టీనీళ్ళే విటమిన్లూ
తెల్ల దొరలు ఇండియాకు తెచ్చారుటీ,
ఆ టీ తాగి వాళ్ళతోటి వేసాము బేరి అన్నాడు
అలనాటి ఆ శ్రీశ్రీ, తనుటీ తాగడంలో ఘునాపాటి టీ వల్ల లాభాలు శతకోటి,
ఆ లిస్టంతా అవుతుంది రామకోటి
ఏ ఛాయ్ చాయ్ చటుక్కున తాగరా భాయ్
ఈ ఛాయ్ చమక్కులే చూడరా భాయ్
చరణం 2:
అల్లం టీ అంటే అదిపెంచెను ఆరోగ్యం
మసాలా టీ అంటే అది దించునురా మైకం
లెమన్ టీ కొడితే ఇక లేజీ మటుమాయం
ఇరానీ టీ పడితే ఇటురాదా ఆ స్వర్గం
కేపుల్లో దాబాల్లో ఫైవ్ స్టార్ హొటల్లో ఎక్కడైనా దొరికేది ఏంటీ – టీ
టీ సినిమాహాలల్లో విశ్రాంతి వేళల్లో తప్పకుండా తాగేది ఏంటీ – టీ అన్నా
టీ కొట్టుతోనే బతుకుతారు కొందరు టీ కొడితేనే బతుకుతారు అందరూ
ఏ ఛాయ్ చాయ్ చటుక్కున తాగరా భాయ్
ఈ ఛాయ్ చమక్కులే చూడరా భాయ్
ఏ ఛాయ్ చాయ్ చటుక్కున తాగరా భాయ్
ఈ ఛాయ్ చమక్కులే చూడరా భాయ్
ఏ ఛాయ్ ఖరీదులో చీపురా భాయ్,
ఈ ఛాయ్ ఖుషీలనే చూపురా భాయ్
ఏ ఛాయ్ గరీబుకు విందురా భాయ్
ఈ ఛాయ్ నవాబుకి బంధువే నోయ్
ఏ ఛాయ్ మనస్సుకీ మందురా భాయ్ ఈ ఛాయ్ గలాసుకీ జై జై