3, డిసెంబర్ 2021, శుక్రవారం

Pelli Sandadi : Chikkaledu Chinnadani Song Lyrics (చిక్కలేదు చిన్నదాని ఆచూకి)

చిత్రం : పెళ్లి సందడి (1996)

సంగీతం: ఎం. ఎం. కీరవాణి

సాహిత్యం: ఎం. ఎం. కీరవాణి

గానం: మనో , ఎం. ఎం. కీరవాణి 



బిక్కుబిక్కుమంటు వంట ఇంట నక్కాము లక్కు మాకు దక్కునంటు ఇక్కడొచ్చి పడ్డాము కొంటెదాని జాడ లేక గరిట చేతపట్టాము పిట్ట నేడు కానరాక పిండి రుబ్బుతున్నాము అయినా చిక్కలేదు చిన్నదాని ఆచూకి చెప్పరాని ఆశలన్ని హుష్కాకి చిక్కలేదు చిన్నదాని ఆచూకి చెప్పరాని ఆశలన్ని హుష్కాకి దప్పలాలు గుప్పుమంటు గొప్పగుంది మావంట అప్పడాలు చేయకుండ తప్పలేదు ఈపూట మక్కువైన చెక్కిలాలు సుబ్బరంగ బొబ్బట్లు చక్కనైన చుక్కకొరకు లెక్కలేని ఇక్కట్లు పెరుగు పచ్చడి పులిహోర పొంగలి సాపాటు రెప్పపాటులో రెడీ నాభి సుందరి నాలోని ఊపిరి వరించి చేరుటెప్పుడో ఒడి స్వీటులెన్నో హాటులెన్నో ధీటుగానే వండినాము రొస్టులోన తేస్టులెన్నొ రెస్టులేక నింపినాము అయినా చిక్కలేదు చిన్నదాని ఆచూకి చెప్పరాని ఆశలన్ని హుష్కాకి హ చిక్కలేదు చిన్నదాని ఆచూకి చెప్పరాని ఆశలన్ని హుష్కాకి చిటెకలోనె సిద్దమయ్యే జాంగిరీలు ఎంచక్కా గుటకలోన కరిగిపోవు గులాబ్జాము ఈపక్క పాలకోవ పంచదార పాయసాలు ఓపిగ్గా పెళ్ళివిందులోకి వండి వార్చినాము భేషుగ్గా నేతి బూరెలు లేలేత గారెలు భలేగ కొలువుతీరి ఉన్నవి పూతరేకులు కచోరి అరిసెలు ఊరించి రుచులు పెంచుతున్నవి మచ్చ ఉన్న మాయలేడి వేటకొచ్చి వేగినాము స్వచ్చమైన నెయ్యిలోన వంటకాలు వేపినాము చిక్కలేదు చిన్నదాని ఆచూకి చెప్పరాని ఆశలన్ని హుష్కాకి రుబ్బురుబ్బి రుబ్బలేక హబ్బబ్బో బొబ్బలెక్కి చేతులన్ని ఓయబ్బో పిల్లమాట దేవుడెరుగు బామ్మర్ది ఒళ్ళు హూనమయ్యి దురద తీరింది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి