చిత్రం: వసంతం(2003)
రచన: కుల శేఖర్
గానం: హరి హారన్
సంగీతం: S.A.రాజ్ కుమార్
అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా రంభా ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా కనులారా నిన్ను చూస్తే తెలిసిందే బ్రహ్మ కష్టం ఇలలోన నిన్ను మించే సిరిలేదే నగ్నసత్యం నాలో ఏదో సవ్వడి ఏమో ఏమిటిది ప్రేమో ఏమో ఏమిటో నన్నే మార్చినది అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా రంభా ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా నిషాకళ్ళతోటి వలే వేయకమ్మా అరే చిక్కుకోదా ఎదే చేపగా వయ్యారాల వైపు అలా చూడకయ్యా సిరే కందిపోదా మరీ ఎర్రగా నువ్వే కాని పువ్వు అయితే నేను తుమ్మెదవుతా నువ్వే కాలిమువ్వ అయితే నేను రాగమవుతా నిన్నే దాచుకుంటాలే ప్రియా గుండె కోవెల్లోన బాపు గీసిన బొమ్మకి చెల్లివి నీవు చెలి ప్రాణం పోసుకు వచ్చిన పాటవు నీవు సఖీ అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా రంభా ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా ప్రియా నిన్ను చూసి మదే మారిపోయే అదేం మాయెగాని వానవిల్లుగా చెలీ నిన్ను చేరి ఎడారైన గానీ వసంతాలు జల్లే పూలవెల్లువ నువ్వే నిద్దరోతే తే నేను జోలపాటనవుతా నువ్వే దగ్గరయితే హాయి లోన తేలిపోతా చెలీ నువ్వు అవునంటే సరాగాల సంభరమవుతా నువ్వు నేను ఏకమై ఇపుడే మనమవుదాం నింగినేల సాక్షిగా ఎపుడూ ఒకటవుదాం అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా రంభా ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా కలలోన నిన్నుచూసి మనసార కోరకున్న ఇలలోన ఇంతలోన ఎదురైతే చేరుకున్నా నాలో ఏదో సవ్వడి ఏమో ఏమిటిది ప్రేమో ఏమో ఏమిటో నన్నే మార్చినది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి