Vasantham లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Vasantham లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

19, నవంబర్ 2022, శనివారం

Vasantam : Godaralleponge Song Lyrics (గోదారల్లె పొంగే నాలో సంతోషం)

చిత్రం: వసంతం(2003)

రచన: కుల శేఖర్

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: S.A.రాజ్ కుమార్




గోదారల్లె పొంగే నాలో సంతోషం గోరింతల్లె పూచే నాలో ఆనందం హరివిల్లై విరిసిందమ్మ కల్లలోన ఆశ సిరిమువ్వై పలికిందమ్మా గుండెల్లోన శ్వాస కలహంస నడకల్లోన అందాల హైలస్సా నేడే తెచ్చిందమ్మ మల్లెల వాసంతం నిండా నింపిదమ్మా నాలో సంగీతం గోదారల్లె పొంగే నాలో సంతోషం గోరింతల్లె పూచే నాలో ఆనందం గుండెలో వేల ఆశలే నన్ను ఇంతగా పెంచాయిలే కళ్ళలో కోటి కాంతులే పలు వింతలే చూపాయిలే సంక్రాంతే రోజు నామదికి ఈ అనుభవమే నాకు కొత్త గున్నది రానంటునే వచ్చిందమ్మా కొంటె కోయిల రాగాలెన్నో తీసివమ్మా తియ్యతీయగా  గోదారల్లె పొంగే నాలో సంతోషం గోరింతల్లె పూచే నాలో ఆనందం గాలిలో మబ్బు రేకులా మనసెందుకో తేలిందిలే హాయిగా పండు వెన్నెల పగలే ఇలా జారిందిలే సందేహం లేదే నాకు మరి ఇది ఆనందం చేసే కొంటె అల్లరి గుండెల్లోన ఉండాలంటే ఎపుడూ ఆరాటం మాటల్లోన చెప్పాలంటే బ్రతుకే పోరాటం  గోదారల్లె పొంగే నాలో సంతోషం గోరింతల్లె పూచే నాలో ఆనందం హరివిల్లై విరిసిందమ్మ కల్లలోన ఆశ సిరిమువ్వై పలికిందమ్మా గుండెల్లోన శ్వాస కలహంస నడకల్లోన అందాల హైలస్సా నేడే తెచ్చిందమ్మ మల్లెల వాసంతం నిండా నింపిదమ్మా నాలో సంగీతం



4, డిసెంబర్ 2021, శనివారం

Vasantam : Jampanduve Song Lyrics (జాంపండువే దోర జాంపండువే)

చిత్రం: వసంతం(2003)

రచన: వేటూరి

గానం: ఉదిత్ నారాయణ్, సుజాత

సంగీతం: S.A.రాజ్ కుమార్



పల్లవి : జాంపండువే దోర జాంపండువే పూ చెండువే మల్లె పూ చెండువే నీ పాలబుగ్గ ఎర్రమొగ్గలేస్తే నా మనసున తైతక్క రవి చూడని రవికను చూస్తే నా వయసుకు తలతిక్క జాంపండునే దోర జాంపండునే పూచెండునే మల్లె పూచెండునే చరణం : 1 ఊగింది ఊగింది నా మనసు ఊగింది నీకంటి రెప్పల్లో అవి ఏం చిటికెలో అవి ఏం కిటుకులో ఉరికింది ఉరికింది నా వయసు ఉరికింది నీ నడుము ఒంపుల్లో అవి ఏం కులుకులో అవి ఏం మెలికలో ఇది పంచదార చిలకా అంచులన్నీ కొరకా మీదికొచ్చి వాలమాకా ఓ చందనాల చినుకా కుందనాల మొలకా కోక డాబు కొట్టమాకా నువ్వే నేనుగా తిరిగాం జంటగా నిప్పే లేదుగా రగిలాం మంటగా

జాంపండువే దోర జాంపండువే పూ చెండువే మల్లె పూ చెండువే నీ పాలబుగ్గ ఎర్రమొగ్గలేస్తే నా మనసున తైతక్క రవి చూడని రవికను చూస్తే నా వయసుకు తలతిక్క చరణం : 2 ఒళ్లంత తుళ్లింతై చెమటెంత పడుతున్నా ఆ చెమట చేరని చోటు చూపించవే అది చూపించవే కళ్లంత కవ్వింతై ఓ వింత చెబుతున్నా ఆ చెమట చేరని చోటు ఈ పెదవులే కొరికే పెదవులే నువ్వు ఆడ సోకు చూపి ఈడ కొంత దాచి కుర్రగుండె కోయమాకా నన్ను కౌగిలింతలడగ కచ్చికొద్దీ కొరకా కన్నె సైగ కోరమాకా మరుగే ఉందిగా చొరవే చేయగా పరువేం పోదుగా ఒడిలో చేరగా ॥ నా పాలబుగ్గ ఎర్రమొగ్గలేస్తే నీ మనసున తైతక్క రవి చూడని రవికను చూస్తే నీ వయసుకు తలతిక్క


జాంపండువే దోర జాంపండువే పూ చెండువే మల్లె పూ చెండువే నీ పాలబుగ్గ ఎర్రమొగ్గలేస్తే నా మనసున తైతక్క రవి చూడని రవికను చూస్తే నా వయసుకు తలతిక్క

Vasantam : Ammo Ammayena Song Lyrics (అమ్మో అమ్మాయేనా)

చిత్రం: వసంతం(2003)

రచన: కుల శేఖర్

గానం: హరి హారన్

సంగీతం: S.A.రాజ్ కుమార్



అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా రంభా ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా కనులారా నిన్ను చూస్తే తెలిసిందే బ్రహ్మ కష్టం ఇలలోన నిన్ను మించే సిరిలేదే నగ్నసత్యం నాలో ఏదో సవ్వడి ఏమో ఏమిటిది ప్రేమో ఏమో  ఏమిటో నన్నే మార్చినది అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా రంభా ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా నిషాకళ్ళతోటి వలే వేయకమ్మా అరే చిక్కుకోదా ఎదే చేపగా వయ్యారాల వైపు అలా చూడకయ్యా సిరే కందిపోదా మరీ ఎర్రగా నువ్వే కాని పువ్వు అయితే నేను తుమ్మెదవుతా నువ్వే కాలిమువ్వ అయితే నేను రాగమవుతా నిన్నే దాచుకుంటాలే ప్రియా గుండె కోవెల్లోన బాపు గీసిన బొమ్మకి చెల్లివి నీవు చెలి ప్రాణం పోసుకు వచ్చిన పాటవు నీవు సఖీ అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా రంభా ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా ప్రియా నిన్ను చూసి మదే మారిపోయే అదేం మాయెగాని వానవిల్లుగా చెలీ నిన్ను చేరి ఎడారైన గానీ వసంతాలు జల్లే పూలవెల్లువ నువ్వే నిద్దరోతే తే నేను జోలపాటనవుతా నువ్వే దగ్గరయితే హాయి లోన తేలిపోతా చెలీ నువ్వు అవునంటే సరాగాల సంభరమవుతా నువ్వు నేను ఏకమై ఇపుడే మనమవుదాం నింగినేల సాక్షిగా ఎపుడూ ఒకటవుదాం అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా రంభా ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా కలలోన నిన్నుచూసి మనసార కోరకున్న ఇలలోన ఇంతలోన ఎదురైతే చేరుకున్నా నాలో ఏదో సవ్వడి ఏమో ఏమిటిది ప్రేమో ఏమో  ఏమిటో నన్నే మార్చినది

30, నవంబర్ 2021, మంగళవారం

Vasantam : Ninnu Choodaka Song Lyrics (నిను చూడక ముందర)

చిత్రం: వసంతం(2003)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: హరి హారన్

సంగీతం: S.A.రాజ్ కుమార్




నిను చూడక ముందర తెలియదులె అసలందము ఉన్నదని నిను చూడక ముందర తెలియదులె అసలందము ఉన్నదని నిను చూసిన కంటికి ఎప్పటికి నిదురన్నది రాదు అని మదిలో మరుమల్లెల వాన కురిసే వెల పగలే సిరివెన్నెల రాదా చెలియా నీలా ఓ పలరతి బొమ్మ నలోన ఊపిరమ్మ ఓ కొండపల్లి బొమ్మ నీరాక కొత్త జన్మ నిను చూడక ముందర తెలియదులె అసలందము ఉన్నదని... రంగు రంగు పువ్వుల్లో లేనెలేదు ఈ గంధం నిన్ను తాకి పంపిదా చల్లగాలి సాయంత్రం వేళవేళ భాషల్లో లేనెలేదు ఇంతందం తేలికైన నీమాటే సుస్వరాలసంగీతం ఓ… నీలోని ఈ మౌనం కవితే అనుకొనా... నవ కవితే అనుకోనా నాలోని ఈ ప్రాణం వెతికే చిరునామా నీవేగా ఓమైనా సూరీడు జారుకుంటే లోకాలు చీకటేగా నువుకాని దూరమైతే నాగుండె ఆగిపోదా నిను చూడక ముందర తెలియదులె అసలందము ఉన్నదని... నీలినీలి కన్నుల్లో ఎన్ని ఎన్ని అందాలు కాటుకమ్మ కలమైతే ఎన్నివేల గ్రంధాలు ముద్దుగుమ్మ నవ్వుల్లో రాలుతున్న ముత్యాలు పంచదార పెదవుల్లో తెంచలేని సంకెళ్లు ఓ… నాలోని ఈ భావం ప్రేమ అనుకోనా... తొలిప్రేమే అనుకొనా ఈ వేళ ఈ రాగం వరమే అనుకోనా కలవరమా నిజమేనా ఈ ప్రేమ భాష రాక నీతోటి చెప్పలేక నీలాల కంటిపాప రాసింది మౌనలేఖ నిను చూడక ముందర తెలియదులె అసలందము ఉన్నదని నిను చూసిన కంటికి ఎప్పటికి నిదురన్నది రాదు అని మదిలో మరుమల్లెల వాన కురిసే వెల పగలే సిరివెన్నెల రాదా చెలియా నీలా ఓ పలరతి బొమ్మ నలోన ఊపిరమ్మ ఓ కొండపల్లి బొమ్మ నీరాక కొత్త జన్మ