చిత్రం: ఆకలి రాజ్యం (1981)
రచన: ఆత్రేయ
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సంగీతం: ఎం. ఎస్. విశ్వనాథన్
హే హే హే హే హే హే హే.హే ఏ ఏహే. రు రు రు రు రూరు రూ రూ రురు. సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్. సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్. రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే. బ్రదరూ. స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్. సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్. రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే. బ్రదరూ. స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్. మన తల్లి అన్నపూర్ణ .మన అన్న దాన కర్ణ .మన భూమి వేద భూమిరా. తమ్ముడూ. మన కీర్తి మంచు కొండరా.ఆ ఆ!! మన తల్లి అన్నపూర్ణ .మన అన్న దాన కర్ణ .మన భూమి వేద భూమిరా. తమ్ముడూ. మన కీర్తి మంచు కొండరా.ఆ ఓ ఓ!! డిగ్రీలు తెచ్చుకుని, చిప్ప చేత పుచ్చుకుని ఢిల్లీకి చేరినాము.దేహి దేహి అంటున్నాము దేశాన్ని పాలించే భావిపౌరులం బ్రదర్. సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్. రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే. బ్రదరూ. స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్. బంగారు పంట మనది.మిన్నేరు గంగ మనది ఎలుగెత్తి చాటుతామురా. ఇంట్లో. ఈగల్ని తోలుతామురా!! ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్పా?? ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్పా?? ఆవేశం ఆపుకోని అమ్మా నాన్నదే తప్పా.ఆ ఆ. ఆవేశం ఆపుకోని అమ్మా నాన్నదే తప్పా?? గంగలో మునకేసి కాషాయం కట్టెయ్ బ్రదర్. సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్. రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే. బ్రదరూ. స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్. సంతాన మూళికలం.సంసార భానిసలం.సంతాన లక్ష్మి మనదిరా తమ్ముడూ. సంపాదనొకటి బరువురా.ఓ ఓ. చదువెయ్య సీటు లేదు.చదివొస్తే పని లేదు. అన్నమో రామచంద్రా అంటే పెట్టే దిక్కే లేదు దేవుడిదే భారమని తెంపు చేయరా బ్రదర్. సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్. రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే. బ్రదరూ. స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి