చిత్రం: అరవింద సమేత (2018)
రచన: రామజోగయ్య శాస్త్రి
గానం: కాల భైరవ
సంగీతం: తమన్.ఎస్
నిద్దర్ని ఇరిసేసి రెప్పల్ని తెరిసాను నువ్వొచ్చే దారుల్లో సూపుల్ని పరిసాను ఒంటెద్దు బండెక్కి రారా.. సగిలేటి డొంకల్లో పదిలంగా రారా నలిగేటి నా మనసు గురుతొచ్చి రారా గలబోటి కూరొండి పిలిసీనా రారా పెనిమీటీ ఎన్నినాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా ఎన్నెన్ని నాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా చిమ్మటి చీకటి కమ్మటి సంగటి ఎర్రగా కుంపటి యెచ్చగా దుప్పటి కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటీ – 2 చిమ్మటి చీకటి కమ్మటి సంగటి ఎర్రగా కుంపటి యెచ్చగా దుప్పటి కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటీ – 2 పొలిమేర దాటి పోయావని పొలమారిపోయే నీ దానిని కొడవలి లాంటి నిన్ను సంటివాడని కొంగున దాసుకునే ఆలి మనసుని సూసీ సూడక.. సులకన సేయకు.. నా తలరాతలో కలతలు రాయకు తాళిబొట్టు తలసుకుని తరలి తరలి రార పెనిమిటీ తాళిబొట్టు తలసుకుని తరలి తరలి రార పెనిమిటీ నరగోస తాకే కామందువే నరగోస తాకే కామందువే నలపూసవై నా కంటికందవే కటికి ఎండలలో కందిపోతివో రగతపు సిందులతో తడిసిపోతివో యేళకు తింటివో ఎట్టనువ్వుంటివో యేట కత్తి తలగడై యేడ పండుకుంటివో నువ్వుగన్న నలుసునైన తలసి తలసి రార పెనిమిటీ. నువ్వుగన్న నలుసునైన తలసి తలసి రార పెనిమిటీ. నిద్దర్ని ఇరిసేసి రెప్పల్ని తెరిసాను నువ్వొచ్చే దారుల్లో సూపుల్ని పరిసాను ఒంటెద్దు బండెక్కి రారా.. సగిలేటి డొంకల్లో పదిలంగా రారా నలిగేటి నా మనసు గురుతొచ్చి రారా గలబోటి కూరొండి పిలిసీనా రారా పెనిమీటీ ఎన్నినాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా ఎన్నెన్ని నాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి