Aravindha Sametha లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Aravindha Sametha లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

7, జనవరి 2022, శుక్రవారం

Aravindha Sametha : Reddamma Thalli Song Lyrics (ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన)

 

చిత్రం: అరవింద సమేత (2018)

రచన: పెంచల్ దాస్

గానం: మోహన భోగరాజు

సంగీతం: తమన్.ఎస్



ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన నీ పెనిమిటి కూలినాడమ్మా రెడ్డెమ్మ తల్లి.. సక్కానైనా పెద్దా రెడ్డెమ్మ నల్లారేగడి నేలలోన ఎర్రాజొన్న చేలలోన నల్లారేగడి నేలలోన ఎర్రాజొన్న చేలలోన నీ పెనిమిటి కాలినాడమ్మా రెడ్డెమ్మ తల్లి.. గుండెలవిసి పోయె గదమ్మా సిక్కే నీకు సక్కానమ్మ పలవారేని దువ్వెనమ్మ సిక్కే నీకు సక్కానమ్మ పలవారేని దువ్వెనమ్మా సిక్కు తీసి కొప్పె పెట్టమ్మ రెడ్డమ్మ తల్లి... సింధూరం బొట్టు పెట్టమ్మా కత్తివాదర నెత్తురమ్మా కడుపు కాలి పోయేనమ్మా కత్తివాదర నెత్తురమ్మా కడుపు కాలి పోయేనమ్మా కొలిచి నిన్ను వేడినాడమ్మా రెడ్డమ్మ తల్లి... కాచీమమ్ము.. బ్రోవు మాయమ్మా నల్లాగుడిలొ కోడి కూచే మేడాలోనా నిదుర లేచే నల్లాగుడిలొ కోడి కూచే మేడాలోనా నిదుర లేచే సక్కానైన పెద్ద రెడ్డెమ్మ బంగారు తల్లి సత్యామైన పెద్ద రెడ్డెమ్మా సత్యామైన పెద్ద రెడ్డెమ్మా సత్యామైన పెద్ద రెడ్డెమ్మా

6, జనవరి 2022, గురువారం

Aravindha Sametha : Yeda Poyinado Song Lyrics (ఏడ బొయ్యాడో..)

చిత్రం: అరవింద సమేత (2018)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, పెంచల్ దాస్

గానం: నిఖిత శ్రీవల్లి, కైలాష్ ఖేర్, పెంచల్ దాస్

సంగీతం: తమన్.ఎస్



పల్లవి:  ఏ కోనలో కూడినాడో  ఏ కొమ్మలో చేరినాడో..  ఏ ఊరికో.. ఏ వాడికో  ఏడ బొయ్యాడో..  రమ్.. రుధిరం.. సమరం.. శిశిరం..  రమ్.. మరణం.. గెలవమ్.. ఎవరం..  ఏడ బోయినాడో.. ఏడ బోయినాడో..  సింతలేని లోకం.. సూడబోయి నాడో..  చరణం:  చారడేసి గరుడ పచ్చ.. కళ్లు వాల్చి  గరికపచ్చా.. నేలపైనే..  సీమ కచ్చా.. వేటు వేస్తే..  రాలిపోయినాడో..  రమ్.. రుధిరం.. సమరం.. శిశిరం..  రమ్.. మరణం.. గెలవమ్.. ఎవరం..  కట్టెలే సుట్టాలు.. కాదు మన తల్లి  అగ్గిదేవుడే మనకు ఆత్మబంధువుడంట..  కాలవగట్టూనా.. నీ కాళ్లు కాలంగా..  కాకి శోకమున్ బోతిమే..  కాకి శోకమున్ బోతిమే..  నరక స్వర్గా అవధి దాటి..  వెన్నామాపులు దాటీ..  విధియందు రారానీ..  తదియందు రారానీ..  నట్టింట ఇస్తర్లు..  నాణ్యముగా పరిపించీ..  నీ వారు చింతా పొయ్యేరూ..  నీ వారు దు:ఖ పొయ్యేరూ..  మృత్యువు మూకుడు మూసిన ఊళ్లకు  రెక్కలు తొడిగేదెవరని..  ఇంకని చెపలు పారే శోకం..  తూకం వేసేదెవరని..  కత్తుల అంచున.. ఎండిన నెత్తురు  కడిగే అత్తరు ఎక్కడని..  ఊపిరాడనీ.. గుండెకు గాలిని..  కబలం ఇచ్చేదెవ్వరనీ..  చుక్కేలేని నింగీ..  ప్రశ్నించిందా... వంగీ..  ఏ కోనల్లో.. కూలినాడో..  ఏ కొమ్మల్లో చేరినాడో..  రమ్.. రుధిరం.. సమరం.. శిశిరం..  రమ్.. మరణం.. గెలవమ్.. ఎవరం..  హరోం.. హరీ.. నీ కుమారులిచ్చిన  భక్ష భోజనములు..  రాగికానులు.. ఇరం విడిచి పరం జేరిన  వారి పెద్దలకు.. పేరంటాలకు..  మోక్షాదిఫలము శుభోజయము..  పద్నాలుగు తరాల వారికి  మోక్షాదిఫలము కల్గును  శుభోజయము.. శుభోజయము.

Aravindha Sametha : Peniviti Song Lyrics (పెనిమీటీ )

చిత్రం: అరవింద సమేత (2018)

రచన: రామజోగయ్య శాస్త్రి

గానం: కాల భైరవ

సంగీతం: తమన్.ఎస్



నిద్దర్ని ఇరిసేసి రెప్పల్ని తెరిసాను నువ్వొచ్చే దారుల్లో సూపుల్ని పరిసాను ఒంటెద్దు బండెక్కి రారా.. సగిలేటి డొంకల్లో పదిలంగా రారా నలిగేటి నా మనసు గురుతొచ్చి రారా గలబోటి కూరొండి పిలిసీనా రారా పెనిమీటీ ఎన్నినాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా ఎన్నెన్ని నాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా చిమ్మటి చీకటి కమ్మటి సంగటి ఎర్రగా కుంపటి యెచ్చగా దుప్పటి కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటీ – 2 చిమ్మటి చీకటి కమ్మటి సంగటి ఎర్రగా కుంపటి యెచ్చగా దుప్పటి కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటీ – 2 పొలిమేర దాటి పోయావని పొలమారిపోయే నీ దానిని కొడవలి లాంటి నిన్ను సంటివాడని కొంగున దాసుకునే ఆలి మనసుని సూసీ సూడక.. సులకన సేయకు.. నా తలరాతలో కలతలు రాయకు తాళిబొట్టు తలసుకుని తరలి తరలి రార పెనిమిటీ తాళిబొట్టు తలసుకుని తరలి తరలి రార పెనిమిటీ నరగోస తాకే కామందువే నరగోస తాకే కామందువే నలపూసవై నా కంటికందవే కటికి ఎండలలో కందిపోతివో రగతపు సిందులతో తడిసిపోతివో యేళకు తింటివో ఎట్టనువ్వుంటివో యేట కత్తి తలగడై యేడ పండుకుంటివో నువ్వుగన్న నలుసునైన తలసి తలసి రార పెనిమిటీ. నువ్వుగన్న నలుసునైన తలసి తలసి రార పెనిమిటీ. నిద్దర్ని ఇరిసేసి రెప్పల్ని తెరిసాను నువ్వొచ్చే దారుల్లో సూపుల్ని పరిసాను ఒంటెద్దు బండెక్కి రారా.. సగిలేటి డొంకల్లో పదిలంగా రారా నలిగేటి నా మనసు గురుతొచ్చి రారా గలబోటి కూరొండి పిలిసీనా రారా పెనిమీటీ ఎన్నినాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా ఎన్నెన్ని నాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా

4, డిసెంబర్ 2021, శనివారం

Aravindha Sametha : Reddy Ikkada Soodu Song Lyrics (రెడ్డి ఇక్కడ సూడు)

చిత్రం: అరవింద సమేత (2018)

రచన: రామజోగయ్య శాస్త్రి

గానం: దలేర్ మెహందీ, అంజనా సౌమ్య

సంగీతం: తమన్.ఎస్


వేయి శుభములు కలుగు నీకు పోయి రావే మరదలా ప్రాణప్రదంగా పెంచుకొంటిమి నిను మరువగా లేములో వేయి శుభములు కలుగు నీకు పోయి రావే మరదలా

రెడ్డి ఇక్కడ సూడు ఎత్తి సలాబా చూడు చొరవ కలిపి పిలిచే కాలికి పచ్చల ఈడు

వరస కలిపే నేడు కురసా రైకల తాడు సరసకు పిలిసి కట్టు పసిడి పుస్తెల తాడు వేట కత్తికి మీసం పెడితే నాకు లాగే వుంటాది పూల బోతి ఓని చుడితే నీకు మల్లె ఉంటాది నువ్వు నేను జోడి కడితే సీమ కె సెగ పుడతాడు ఆల్రెడీ నేను రెడి అంటానే నా తాకిడి మోజుగా మొత్తగా కూసిందే కోడి షర్ట్ గుండి ఫాట్ అనేలా చేసేయ్ హడావిడి ఏటా వాలు సూపుల్తోనే గెలకమాక్ సెంట్ బుద్ది పట్టు పరుపుల పందిరి పక్క ఎలాగని సాంబ్రాణి కడ్డీ ఏడు తిరిగే లోపే ఇంట్లో తిరుగుతాడు చంటి రెడ్డి

రెడ్డి ఇక్కడ సూడు ఎత్తి సలాబా చూడు చొరవ కలిపి పిలిచే కాలికి పచ్చల ఈడు రాజా సారంగుడంటే అచ్చంగా వీడే రంగారా సింగమల్లే దూకాడు చూడే దూకాడు చూడే అందమంతా గంధకమై రాజేష్ఠానదే రాపిడి హే సూరేకారం సూపులతో ముట్టిస్తా వేడి సిసలైన బొండు మల్లె పూల రాయలోరి బండి పెటాకు పచ్చ జెండా చూసి ఆనకట్ట గండి ఏపుగా ఊపుగా ఎగబడతాందే నీకిది టొప్పుగా ఉన్న కదా చెప్పుకో ఇబ్బంది నుదుట బొట్టున చెమట బొట్టై వేసేయ్ తడి ముడి ఏటా వాలు సూపుల్తోనే గెలకమాక్ సెంట్ బుద్ది పట్టు పరుపుల పందిరి పక్క ఎలాగని సాంబ్రాణి కడ్డీ  ఏడు తిరిగే లోపే ఇంట్లో తిరుగుతాడు చంటి రెడ్డి

రెడ్డి ఇక్కడ సూడు ఎత్తి సలాబా చూడు చొరవ కలిపి పిలిచే కాలికి పచ్చల ఈడు

వరస కలిపే నేడు కురసా రైకల తాడు సరసకు పిలిసి కట్టు పసిడి పుస్తెల తాడు

9, నవంబర్ 2021, మంగళవారం

Aravindha Sametha : Anaganaganaga Song Lyrics (అనగనగనగా అరవిందట)

చిత్రం: అరవింద సమేత (2017)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: అర్మాన్ మాలిక్

సంగీతం: తమన్.ఎస్


చీకటి లాంటి పగటి పూట కత్తుల్లాంటి పూలతోట జరిగిందొక్క వింత వేట పులిపై పడిన లేడి కథ వింటారా జాబిలి రాని రాతిరంతా జాలే లేని పిల్ల వెంట అలికిడి లేని అల్లరంతా గుండెల్లోకి దూరి అది చూస్తారా చుట్టూ ఎవ్వరూ లేరు సాయం ఎవ్వరూ రారు చుట్టూ ఎవ్వరూ లేరు సాయం ఎవ్వరూ రారు నాపై నేనే ప్రకటిస్తున్నా ఇదేమి పోరు అనగనగనగా అరవిందట తన పేరు అందానికి సొoతూరు అందుకనే ఆ పొగరు అరెరెరెరెరే అటు చూస్తే కుర్రాళ్ళు అసలేమైపోతారు అన్యాయం కద ఇది అనరే ఎవ్వరూ హే... ప్రతి నిముషము తనవెంట పడిగాపులే పడుతుంటా ఒకసారి కూడ చూడకుంది క్రీగంట ఏమున్నదో తన చెంత ఇంకెవరికీ లేనంత అయస్కాంతమల్లె లాగుతోంది నన్ను చూస్తూనే ఆ కాంత తను ఎంత చేరువనున్నా అద్దంలో ఉండే ప్రతిబింబం అందునా అంతా మాయలా ఉంది అయినా హాయిగా ఉంది భ్రమలా ఉన్నా బానే ఉందే ఇదేమి తీరు మనవే వినవె అరవింద సరెలే అనవే కనువింద మనకి మనకి రాసుందే కాదంటె సరిపోతుందా మనవే వినవె అరవింద సరెలే అనవే కనువింద మనకి మనకి రాసుందే కాదంటె సరిపోతుందా అనగనగనగా అరవిందట తన పేరు అందానికి సొంతూరు అందుకనే ఆ పొగరు అరెరెరెరెరే అటు చూస్తే కుర్రాళ్ళు అసలేమైపోతారు అన్యాయం కద ఇది అనరే ఎవ్వరూ మనవే వినవె అరవింద సరెలే అనవే కనువింద మనకి మనకి రాసుందే కాదంటె సరిపోతుందా మనవే వినవె అరవింద సరెలే అనవే కనువింద మనకి మనకి రాసుందే కాదంటె సరిపోతుందా అనగనగనగా పులిపై పడిన లేడి కథ వింటారా