19, జనవరి 2022, బుధవారం

Bhagya Chakram : Vana kadu vana kadu Song Lyrics (వాన కాదు వాన కాదు వరదా.. రాజా)

చిత్రం :  భాగ్య చక్రం (1968)
గీతరచయిత : పింగళి
నేపధ్య గానం : సుశీల
సంగీతం : పెండ్యాల



పల్లవి: వాన కాదు వాన కాదు వరదా.. రాజా పూల వాన కురియాలి వరదరాజా హోయ్......వాన కాదు వాన కాదు వరదా రాజా పూల వాన కురియాలి వరదరాజా చరణం 1 : వనము నేలు బాలరాణి ఎవరో అంటూ... నగరి నేలు బాలరాజు చూడరాగా.. వనము నేలు బాలరాణి ఎవరో అంటూ... నగరి నేలు బాలరాజు చూడరాగా... కోకిలమ్మ పాట పాడా...  నెమిలి పిట్ట ఆటలాడా సందడించి నా గుండె ఝల్లు ఝల్లు ఝల్లుమనగా వాన కాదు వాన కాదు వరదా.. రాజా పూల వాన కురియాలి వరద రాజా చరణం 2 : కొండలోన కోనలోనా తిరిగే వేళా అండదండ నీకు నేనే ఉండాలంటూ ... కొండలోన కోనలోనా తిరిగే వేళా అండదండ నీకు నేనే ఉండాలంటూ ... పండు వంటి చిన్నవాడు... నిండు గుండె వన్నెకాడు చేర రాగ కాలి అందె ఘల్లు ఘల్లు ఘల్లు మనగా... వాన కాదు వాన కాదు వరదా రాజా పూల వాన కురియాలి వరదరాజా చరణం 3 : కొండపైన నల్ల మబ్బు పందిరి కాగా కోనలోన మెరుపూ తీగే తోరణ కాగా... కొండపైన నల్ల మబ్బు పందిరి కాగా కోనలోన మెరుపూ తీగే తోరణ కాగా... మల్లెపూల తేరు పైన పెళ్లికొడుకు రాగానే వాణ్ణి చూసి నా మనసు వల్లె వల్లె వల్లె యనగా.. వాన కాదు వాన కాదు వరదా రాజా పూల వాన కురియాలి వరదరాజా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి