28, జనవరి 2022, శుక్రవారం

Bhaktha Prahlada : Jeevamu Neeve Kadaa Video Song Lyrics (జీవము నీవే కదా)

చిత్రం: భక్త ప్రహ్లాద (1967)

సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య

గానం: పి. సుశీల

సంగీతం: సాలూరి రాజేశ్వర రావు



జీవము నీవే కదా దేవా బ్రోచే భారము నీవే కదా! నా భారము నీవే కదా! జనకుడు నీపై కినుక వహించి నను వధియింప మదినెంచే జనకుడు నీపై కినుక వహించి నను వధియింప మదినెంచే చంపేదెవరూ సమసెదెవరూ..చంపేదెవరూ సమసేదెవరు.. సర్వము నీవే కదా..స్వామీ..సర్వము నీవే కదా స్వామీ..!! **************************** కనులకు వెలుగువు నీవే కావా.. కనులకు వెలుగువు నీవే కావా. కనపడు చీకటి మాయే కాదా కనపడు చీకటి మాయే కాదా నిను గనలేని ప్రాణి బ్రతుకే నిజముగ చీకటి ఔగా దేవా..

కనులకు వెలుగువు నీవే కావా.. పేరుకు నేను తల్లిని గానీ ఆదుకొనా లేనైతీ.. పేరుకు నేను తల్లిని గానీ ఆదుకొనా లేనైతీ.. పాలను ద్రాపి ఆకలి బాపే పాలను ద్రాపి ఆకలి బాపే భాగ్యమునైనా నోచని నాకు ఏల జనించితివయ్యా నాకేల జనించితివయ్యా నాకేల జనించితివయ్యా.. అండగ నుండ విధాతవీవు అండగ నుండ విధాతవీవు ఆకలి దప్పుల బాధే లేదు నారాయణ నామామృత రసమే నారాయణ నామామృత రసమే అన్నము పానము కావా దేవా కనులకు వెలుగువు నీవే కావా.. కనపడు చీకటి మాయే కాదా.. నిను గనలేని ప్రాణి బ్రతుకే  నిజముగ చీకటి ఔగా దేవా.. కనులకు వెలుగువు నీవే కావా..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి