చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య
గానం: పి. సుశీల
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
ఓం! నమో ! నారాయణాయ! నారాయణా మంత్రం శ్రీమన్నారాయణ భజనం ||నారా|| భవ బంధాలూ పారద్రోలీ పరము నొసంగే సాధనం గాలిని బంధించీ హఠించీ గాసిల పనిలేదు జీవుల హింసించీ క్రతువులా చేయగ పనిలేదు మాధవా! మధుసూదనా!అని మనసున తలచిన చాలుగా ||నారా|| తల్లియు తండ్రియు నారాయణుడే! గురువూ చదువూ నారాయణుడే! యోగము యాగము నారాయణుడే! ముక్తియు దాతయు నారాయణుడే! భవబంధాలూ పారద్రోలీ పరము నొసంగే సాధనం ||నారా|| నాధ హరే! శ్రీనాథ హరే! నాధహరే జగన్నాధహరే!