26, జనవరి 2022, బుధవారం

Chinarayudu : Kanti Choopu Song Lyrics (కంటి చూపు చాలునయ్యా)

చిత్రం : చినరాయుడు (1992)
సాహిత్యం: భువనచంద్ర
గానం: ఎస్. పీ. బాలసుబ్రహ్మణ్యం
సంగీతం: ఇళయరాజా



ఊరు దిష్టి వాడ దిష్టి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నరుల దిష్టి పరుల దిష్టి మనిషి దిష్టి మాను దిష్టి తల్లి దిష్టి చెల్లి దిష్టి అసలు దిష్టి కొసరు దిష్టి కాటుకలా కరగనీ హారతిలా రగలని చీకటులే తొలగని చిరునవ్వులు విరియనీ… కంటి చూపు చాలునయ్యా చిన్నారాయుడు కంటి చూపు చాలునయ్యా చిన్నారాయుడు కష్టమంత తీరెనయ్యా చిన్నారాయుడు నిన్ను కన్న ఊరు గొప్పదిరా చిన్నారాయుడు హాయ్ కంటి చూపు చాలునయ్యా చిన్నారాయుడు కష్టమంత తీరెనయ్యా చిన్నారాయుడు నీకు దిష్టి తీసి వెయ్యాలయ్యా చిన్నారాయుడు అవును సాక్ష్యులను సెటప్ చేసే ఛాన్స్ లేదు మా ఊరిలో వాయిదాల వకీళ్ళకి చోటు లేదు మా వాడలో కొల్లగొట్టు కోర్టు కన్నా చక్కని తీర్పు నీదేనన్నా అ ఆ ఇ ఈ చదువు కన్నా అన్నం పెట్టే చెయ్యే మిన్న మాట తప్పిపోనివాడు రఘురాముడంటి మొనగాడు చిన్నరాయుడంటి వాడు కోటికొక్కడైన లేనే లేడు తన అండా దండా ఉంటే చాలు ఊరికి ఎంతో మేలు ఏ ఊళ్ళోనైనా ఇట్టాంటోడు ఒక్కడు ఉంటే చాలు హా కంటి చూపు చాలునయ్యా చిన్నారాయుడు కష్టమంత తీరేనయ్యా చిన్నారాయుడు నీకు దిష్టి తీసి వెయ్యాలయ్యా చిన్నారాయుడు నాట్లు నాటే పిల్లగాలి పాటలలో నీవే ఏతమేసే రైతు బిడ్డ మాటలలో నీవే పైట వేసే కన్నెపిల్ల ఊహలలో నీవే మా గుండెలోన పొంగిపోయే ప్రేమలన్నీ నీవే… నాగలెత్తి పట్టుకుంటే చేను తుళ్ళిపోవునంట కాలు పడ్డ బంజరైనా పైడి పంట పండునంట ఉన్నోడు లేనోడనే బేధాలేవీ రానీడయ్య కన్నెర్ర జేశాడంటే దేవుడికైనా భయమేనయ్యా మీసమున్న ప్రతివాడు చిన్నరాయుడంటి వాడు కాడు పేదవాడికోసమైనా తన ప్రాణమిచ్చు దొర వీడు తన అండా దండా ఉంటే చాలు ఊరికి ఎంతో మేలు ఏ ఊళ్ళోనైనా ఇట్టాంటోడు ఒక్కడు ఉంటే చాలు కంటి చూపు చాలునయ్యా చిన్నారాయుడు కష్టమంత తీరేనయ్యా చిన్నారాయుడు నీకు దిష్టి తీసి వెయ్యాలయ్యా చిన్నారాయుడు మ్మ్…కంటి చూపు చాలునయ్యా చిన్నారాయుడు కంటి చూపు చాలునయ్యా చిన్నారాయుడు కష్టమంత తీరెనయ్యా చిన్నారాయుడు నిన్ను కన్న ఊరు గొప్పదిరా చిన్నారాయుడు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి