Chinarayudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Chinarayudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, జనవరి 2022, బుధవారం

Chinarayudu : Kanti Choopu Song Lyrics (కంటి చూపు చాలునయ్యా)

చిత్రం : చినరాయుడు (1992)
సాహిత్యం: భువనచంద్ర
గానం: ఎస్. పీ. బాలసుబ్రహ్మణ్యం
సంగీతం: ఇళయరాజా



ఊరు దిష్టి వాడ దిష్టి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నరుల దిష్టి పరుల దిష్టి మనిషి దిష్టి మాను దిష్టి తల్లి దిష్టి చెల్లి దిష్టి అసలు దిష్టి కొసరు దిష్టి కాటుకలా కరగనీ హారతిలా రగలని చీకటులే తొలగని చిరునవ్వులు విరియనీ… కంటి చూపు చాలునయ్యా చిన్నారాయుడు కంటి చూపు చాలునయ్యా చిన్నారాయుడు కష్టమంత తీరెనయ్యా చిన్నారాయుడు నిన్ను కన్న ఊరు గొప్పదిరా చిన్నారాయుడు హాయ్ కంటి చూపు చాలునయ్యా చిన్నారాయుడు కష్టమంత తీరెనయ్యా చిన్నారాయుడు నీకు దిష్టి తీసి వెయ్యాలయ్యా చిన్నారాయుడు అవును సాక్ష్యులను సెటప్ చేసే ఛాన్స్ లేదు మా ఊరిలో వాయిదాల వకీళ్ళకి చోటు లేదు మా వాడలో కొల్లగొట్టు కోర్టు కన్నా చక్కని తీర్పు నీదేనన్నా అ ఆ ఇ ఈ చదువు కన్నా అన్నం పెట్టే చెయ్యే మిన్న మాట తప్పిపోనివాడు రఘురాముడంటి మొనగాడు చిన్నరాయుడంటి వాడు కోటికొక్కడైన లేనే లేడు తన అండా దండా ఉంటే చాలు ఊరికి ఎంతో మేలు ఏ ఊళ్ళోనైనా ఇట్టాంటోడు ఒక్కడు ఉంటే చాలు హా కంటి చూపు చాలునయ్యా చిన్నారాయుడు కష్టమంత తీరేనయ్యా చిన్నారాయుడు నీకు దిష్టి తీసి వెయ్యాలయ్యా చిన్నారాయుడు నాట్లు నాటే పిల్లగాలి పాటలలో నీవే ఏతమేసే రైతు బిడ్డ మాటలలో నీవే పైట వేసే కన్నెపిల్ల ఊహలలో నీవే మా గుండెలోన పొంగిపోయే ప్రేమలన్నీ నీవే… నాగలెత్తి పట్టుకుంటే చేను తుళ్ళిపోవునంట కాలు పడ్డ బంజరైనా పైడి పంట పండునంట ఉన్నోడు లేనోడనే బేధాలేవీ రానీడయ్య కన్నెర్ర జేశాడంటే దేవుడికైనా భయమేనయ్యా మీసమున్న ప్రతివాడు చిన్నరాయుడంటి వాడు కాడు పేదవాడికోసమైనా తన ప్రాణమిచ్చు దొర వీడు తన అండా దండా ఉంటే చాలు ఊరికి ఎంతో మేలు ఏ ఊళ్ళోనైనా ఇట్టాంటోడు ఒక్కడు ఉంటే చాలు కంటి చూపు చాలునయ్యా చిన్నారాయుడు కష్టమంత తీరేనయ్యా చిన్నారాయుడు నీకు దిష్టి తీసి వెయ్యాలయ్యా చిన్నారాయుడు మ్మ్…కంటి చూపు చాలునయ్యా చిన్నారాయుడు కంటి చూపు చాలునయ్యా చిన్నారాయుడు కష్టమంత తీరెనయ్యా చిన్నారాయుడు నిన్ను కన్న ఊరు గొప్పదిరా చిన్నారాయుడు

Chinarayudu : Swathi Mutyamala Song Lyrics (స్వాతిముత్య మాల )

 
చిత్రం : చినరాయుడు (1992)
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
సంగీతం: ఇళయరాజా



స్వాతిముత్య మాల వొళ్ళుతాకి తుళ్ళిపోయింది సిగ్గు పడ్డ చీర కట్టు వీడి జారీ పోయింది కొంగు చాటు అందాలు కన్ను గొట్టి రమ్మంటే వయసాడమంది సయ్యాట ఇది యవ్వనాలా పూదోట స్వాతిముత్య మాల వొళ్ళుతాకి తుళ్ళిపోయింది పెదవితో పెదవి కలిపితే మధువులే కురియవా తనువుతో తనువు తడిమితే తపనలే రగలవా తొందరెందుకంది కన్నెమనసు పూలతీగలాగా వాటేసి ఊయలూగమంది కోర వయసు కోడె గిత్త లాగ మాటేసి కవ్విస్తున్నది పెట్టె మంచము రావా రావా నా రాజా స్వాతిముత్య మాల వొళ్ళుతాకి తుళ్ళిపోయింది సిగ్గు పడ్డ చీర కట్టు వీడి జారీ పోయింది మేఘమా మెరిసి చూపవే గడసరి తళుకులు మోహమా కొసరి చూడవే మగసిరి మెరుపులు కొల్లగొట్టమంది పిల్ల సొగసు కొంటె కళలన్నీ నేర్పేసి లెక్క పెట్టమంది సన్న రవిక ముద్దులెన్నో మోజు తీర్చేసి పరుపే నలగని పరువం చిలకని మళ్ళి మళ్ళి ఈవేళ స్వాతిముత్యమాల వొళ్ళుతాకి తుళ్ళిపోయింది సిగ్గు పడ్డ చీర కట్టువీడి జారీ పోయింది కొంగు చాటు అందాలు కన్ను గొట్టి రమ్మంటే వయసాడమంది సయ్యాట ఇది యవ్వనాలా పూదోట వయసాడమంది సయ్యాట ఇది యవ్వనాలా పూదోట

Chinarayudu : Nindu Aakasamantha Song Lyrics (నిండు ఆకాశమంత)

చిత్రం : చినరాయుడు (1992)
సాహిత్యం: భువనచంద్ర
గానం: ఎస్. పీ. బాలసుబ్రహ్మణ్యం
సంగీతం: ఇళయరాజా



నిండు ఆకాశమంత మనసు ఉన్న రాజువయ్యా పండు వెన్నెలలాంటి చల్లని చూపుల రేడువయ్యా ముచ్చటగా ఒక తాళి కట్టి నింగికి నేలకు నిచ్చెన వేసిన దేవుడు నీవే చిన్నరాయుడు నీవే నిండు ఆకాశమంత మనసు ఉన్న రాజువయ్యా పండు వెన్నెలలాంటి చల్లని చూపుల రేడువయ్యా గాలిలో తేలే పరువాల పూల కొమ్మ నేల వాలిపొగ చిగురింప చేసి నావే పసుపు తాడు మీద లోకానికున్న ప్రేమ మనిషి మీద లేదు ఈ నీతికెవరు బ్రహ్మ తప్పవురా హేలనలు వేదనలే నీ హితులు గుండెకు బండకు వారధి కట్టిన దేవుడి లీల ఇది కాకుల గోల నిండు ఆకాశమంత మనసు ఉన్న రాజువయ్యా పండు వెన్నెలలాంటి చల్లని చూపుల రేడువయ్యా నీటిలోని చేప కన్నీరు ఎవరికెరుకా... గూటిలోని చిలుక గుబులేదో ఎవరికెరుక నుదుటి మీద రాత వేరెవ్వరు మార్చగలరు న్యాయమూర్తి నీవే తీర్పెవరు తీర్చగలరు ఒంటరిది నీ పయనం నిబ్బరమే నీకాభయం తప్పుకి ఒప్పుకి గంతలు కట్టిన దేవుడి లీల ఇది కాకుల గోల నిండు ఆకాశమంత మనసు ఉన్న రాజువయ్యా పండు వెన్నెలలాంటి చల్లని చూపుల రేడువయ్యా ముచ్చటగా ఒక తాళి కట్టి నింగికి నేలకు నిచ్చెన వేసిన దేవుడు నీవే చిన్నరాయుడు నీవే నిండు ఆకాశమంత మనసు ఉన్న రాజువయ్యా పండు వెన్నెలలాంటి చల్లని చూపుల రేడువయ్యా

1, ఆగస్టు 2021, ఆదివారం

Chinarayudu : Bulli Pitta Song Lyrics (బుల్లి పిట్ట బుజ్జి పిట్ట )

చిత్రం : చినరాయుడు (1992)

సంగీతం: ఇళయరాజా

సాహిత్యం: భువనచంద్ర

గానం: ఎస్. పీ. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి



బుల్లి పిట్ట బుజ్జి పిట్ట గూటిలొని గువ్వ పిట్టా వెంట వెంట వచ్చె వారి పేరు చెప్పవే ఎవరే ఎవరే పిలిచేది నేను ఎట్ట ఎట్ట పలికేది బుల్లి పిట్ట బుజ్జి పిట్ట గూటిలొని గువ్వ పిట్టా నక్కి నక్కి దాగే వారి పేరు చెప్పవే ఎవరో ఎవరో తేలియందే నేను ఎట్ట ఎట్ట పిలిచేదే బుల్లి పిట్ట బుజ్జి పిట్ట గూటిలొని గువ్వ పిట్టా వెంట వెంట వచ్చె వారి పేరు చెప్పవే బుల్లి పిట్ట బుజ్జి పిట్ట గూటిలొని గువ్వ పిట్టా నక్కి నక్కి దాగే వారి పేరు చెప్పవే కొంటే కొణంగి ఈడు కొట్టే కేరింత చూడు ఏదో గమ్మత్తుగ ఉంది మామ. లేనే లేనే లేదంటు హద్దు ముద్దు ముద్దుకి పద్దు రాస్తే ఎట్ట సత్యభామా... బంగారు గిన్నే లోని పరువాల పాయసాలు నీకే ఉంచానే పోకిరి. చక్కంగా ముందుకొచ్చి సందేల విందులిస్తే కాదంటానా జతరామరి వారం వర్జ్యం చూడాలి అపైనే నీతో ఓడలి... బుల్లి పిట్ట బుజ్జి పిట్ట గూటిలొని గువ్వ పిట్టా నక్కి నక్కి దాగే వారి పేరు చెప్పవే బుల్లి పిట్ట బుజ్జి పిట్ట గూటిలొని గువ్వ పిట్టా వెంట వెంట వచ్చె వారి పేరు చెప్పవే ఇంటి తాళ్ళాలు దాచి గంటా మోగించమంటే ఎట్టాగమ్మ గౌరమ్మో. జంటా బాణాలు దూసి ఇట్ట రెట్టిస్తే నన్ను వేగేది ఎట్ట మామయ్యో . గోరింక గూటి ముందు చిలకమ్మ చిందులేసి ఆడిందంటే అర్థం ఏమిటో... మంధార పువ్వు మీద మురిపాలా తుమ్మేదొచ్చి వాలిందంటే మరి దేనికో... నీలొ నేనే దాగాలి చెలరెగే తాపం తీరాలి బుల్లి పిట్ట బుజ్జి పిట్ట గూటిలొని గువ్వ పిట్టా వెంట వెంట వచ్చె వారి పేరు చెప్పవే ఎవరే ఎవరే పిలిచేది నేను ఎట్ట ఎట్ట పలికేది బుల్లి పిట్ట బుజ్జి పిట్ట గూటిలొని గువ్వ పిట్టా నక్కి నక్కి దాగే వారి పేరు చెప్పవే ఎవరో ఎవరో తేలియందే నేను ఎట్ట ఎట్ట పిలిచేదే బుల్లి పిట్ట బుజ్జి పిట్ట గూటిలొని గువ్వ పిట్టా వెంట వెంట వచ్చె వారి పేరు చెప్పవే బుల్లి పిట్ట బుజ్జి పిట్ట గూటిలొని గువ్వ పిట్టా నక్కి నక్కి దాగే వారి పేరు చెప్పవే..