పల్లవి:
తెల్లవారవచ్చె తెలియక నా సామి
తెల్లవారవచ్చె తెలియక నా సామి
మళ్ళీ పరుండేవు లేరా
మళ్ళీ పరుండేవు లేరా
మళ్ళీ పరుండేవు మసలుతూ ఉండేవు ….
మళ్ళీ పరుండేవు మసలుతూ ఉండేవు
మారాము చాలింకలేరా …
మారాము చాలింకలేరా
తెల్లవారవచ్చె తెలియక నా సామి
తెల్లవారవచ్చె తెలియక నా సామి
మళ్ళీ పరుండేవు లేరా
మళ్ళీ పరుండేవు లేరా
చరణం 1:
కలకలమని పక్షి గణములు
చెదిరేను కళ్యాణ గుణధామ లేరా
కలకలమని పక్షి గణములు
చెదిరేను కళ్యాణ గుణధామ లేరా
తరుణులందరు దధి చిలికే
వేళాయే దైవరాయ నిదురలేరా
తరుణులందరు దధి చిలికే
వేళాయే దైవరాయ నిదురలేరా
దైవరాయా నిదురలేరా
చరణం 2:
నల్లనయ్య రారా నను కన్నవాడా
బుల్లితండ్రి రారా బుజ్జాయి రారా
నల్లనయ్య రారా నను కన్నవాడా
బుల్లితండ్రి రారా బుజ్జాయి రారా
నాన్నా మీ అమ్మ గోపెమ్మ పిలిచేను
వెన్న తిందువుగాని రారా
నాన్నా మీ అమ్మ గోపెమ్మ పిలిచేను
వెన్న తిందువుగాని రారా
వెన్న తిందువుగాని రారా
తెల్లవారవచ్చె తెలియక నా సామి
తెల్లవారవచ్చె తెలియక నా సామి
మళ్ళీ పరుండేవు లేరా
మళ్ళీ పరుండేవు లేరా
మళ్ళీ పరుండేవు లేరా
తెలుగు లిరిక్స్ కోసం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి