చిత్రం: బంగారు గాజులు (1968)
సాహిత్యం: దాశరథి
గానం: ఘంటసాల , ఘంటసాల
సంగీతం: తాతినేని చలపతి రావు
విన్నవించుకోనా...చిన్న కోరికా..... ఇన్నాళ్ళూ నా మదిలో ఉన్న కోరికా.... విన్నవించుకోనా...చిన్న కోరికా..... నల్లని నీ కురులలో తెల తెల్లని సిరి మల్లె నై... నల్లని నీ కురులలో తెల తెల్లని సిరి మల్లె నై... పరిమళాలు జిలుకుచూ... నే పరవశించి పోనా.... విన్నవించుకోనా...చిన్న కోరికా..... వెచ్చని నీ కౌగిట పవళించినా నవ వీణనై... వెచ్చని నీ కౌగిట పవళించినా నవ వీణనై... రాగమే అనురాగమై నీ మనసు నిండి పోనా..... విన్నవించుకోనా...చిన్న కోరికా..... తీయని నీ పెదవిపై చెలరేగినా ఒక పాటనై... తీయని నీ పెదవిపై చెలరేగినా ఒక పాటనై... అందరాని నీలినింగి అంచులందు కోనా.... విన్నవించుకోనా...చిన్న కోరికా..... చల్లని నీ చూపులే తెలి వెన్నెలై విరబూయగా... చల్లని నీ చూపులే తెలి వెన్నెలై విరబూయగా... కలువనై నీ చెలియనై నీ కన్నులందు వెలిగేనా.... విన్నవించుకోనా...చిన్న కోరికా..... ఇన్నాళ్ళూ నా మదిలో ఉన్న కోరికా.... విన్నవించుకోనా...చిన్న కోరికా.....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి