చిత్రం: చిట్టిచెల్లెలు (1970)
రచన: దాశరథి. కృష్ణమాచార్య సంగీతం: సాలూరి. రాజేశ్వరరావు గాయని: సుశీల
అందాల పసిపాప అన్నయ్యకు కనుపాప
బజ్జోవే బుజ్జాయి నేనున్నది నీ కొరకే నీకన్నా నాకెవరే
ఆ చల్లని జాబిలి వెలుగు ఆ చక్కని చుక్కల తళుకు
నీ మనుగడలో నిండాలమ్మా నా కలలన్ని పండాలమ్మా
అందాల పసిపాప అన్నయ్యకు కనుపాప
బజ్జోవే బుజ్జాయి నేనున్నది నీ కొరకే నీకన్నా నాకెవరే
మన తల్లే దైవముగా కలకాలం కాపాడునులే
తోడై నీడై లాలించునులే మనకే లోటు రానీయదులే
అందాల పసిపాప అన్నయ్యకు కనుపాప
బజ్జోవే బుజ్జాయి నేనున్నది నీ కొరకే నీకన్నా నాకెవరే
manchi pata andinchinandhuku meeku danyavadamulu
రిప్లయితొలగించండి