Chitti Chellelu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Chitti Chellelu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, జనవరి 2022, గురువారం

Chitti Chellelu : Andala Pasi Papa Song Lyrics (అందాల పసిపాప )

చిత్రం: చిట్టిచెల్లెలు (1970)

రచన: దాశరథి. కృష్ణమాచార్య సంగీతం: సాలూరి. రాజేశ్వరరావు గాయని: సుశీల

అందాల పసిపాప అన్నయ్యకు కనుపాప బజ్జోవే బుజ్జాయి నేనున్నది నీ కొరకే నీకన్నా నాకెవరే ఆ చల్లని జాబిలి వెలుగు ఆ చక్కని చుక్కల తళుకు నీ మనుగడలో నిండాలమ్మా నా కలలన్ని పండాలమ్మా


అందాల పసిపాప అన్నయ్యకు కనుపాప బజ్జోవే బుజ్జాయి నేనున్నది నీ కొరకే నీకన్నా నాకెవరే
మన తల్లే దైవముగా కలకాలం కాపాడునులే తోడై నీడై లాలించునులే మనకే లోటు రానీయదులే

అందాల పసిపాప అన్నయ్యకు కనుపాప బజ్జోవే బుజ్జాయి నేనున్నది నీ కొరకే నీకన్నా నాకెవరే

31, జులై 2021, శనివారం

Chitti Chellelu : Ee Reyi Thiyyanidi Song Lyrics

చిత్రం: చిట్టి చెల్లెలు (1970)

సాహిత్యం: సి. నారాయణ రెడ్డి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల

సంగీతం: సాలూరి రాజేశ్వర రావు


ఈ రేయి తియ్యనిది ఈ చిరుగాలి మనసైనది ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది ఏవేవో కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి ఆ కొంటె మల్లికలు అల్లన దాగి వింటున్నవి

పన్నీటి తలపులు నిండగా ఇన్నాళ్ళ కలలే పండగా పన్నీటి తలపులు నిండగా ఇన్నాళ్ళ కలలే పండగా చిన్నారి చెలియా అపరంజి కలువ చేరాలి కౌగిట జిలిబిలి నగవుల

ఏవేవో కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి ఆ కొంటె మల్లికలు అల్లన దాగి వింటున్నవి

పరువాలు పల్లవి పాడగా నయనాలు సయ్యాటలాడగా పరువాలు పల్లవి పాడగా నయనాలు సయ్యాటలాడగా నిను చేరుకోగా నును మేని తీగ పులకించిపోయెను తొలకరి వలపుల

ఈ రేయి తియ్యనిది ఈ చిరుగాలి మనసైనది ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది

ఎన్నెన్ని జన్మల బంధమో ఏ పూల నోముల పుణ్యమో ఎన్నెన్ని జన్మల బంధమో ఏ పూల నోముల పుణ్యమో

ఈ రేయి తియ్యనిది ఈ చిరుగాలి మనసైనది ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది నిను నన్ను కలిపే నీ నీడ నిలిపే అనురాగ సీమల అంచులు దొరికే