చిత్రం: దసరా బుల్లోడు (1971)
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఘంటసాల, ,పి. సుశీల
సంగీతం: కె. వి. మహదేవన్
పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్లోయ్ నీ పైటకొంగు జారిందే గడుసు పిల్లా పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్లోయ్ నీ పైటకొంగు జారిందే గడుసు పిల్లా కొంగు జారితేముంది కొంటె పిల్లోడా నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా అహా కొంగు జారితేముంది కొంటె పిల్లోడా నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా కొప్పులోన బంతిపూలు గునుస్తున్నవీ చెప్పలేని వూసులేవో చెప్పుతున్నవీ కొప్పులోన బంతిపూలు గునుస్తున్నవీ చెప్పలేని వూసులేవో చెప్పుతున్నవీ వూసులన్నీ వింటివా వూరుకోవవి ఆశలై, బాసలై అంటుకొంటవి వూసులన్నీ వింటివా వూరుకోవవి ఆశలై, బాసలై అంటుకొంటవి హే పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్లోయ్ నీ పైటకొంగు జారిందే గడుసు పిల్లా అహా కొంగు జారితేముంది కొంటె పిల్లోడా నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా వరిచేను కోతకొచ్చి వంగుతున్నది వంపులన్నీ వయసొచ్చి పొంగుతున్నవి వరిచేను కోతకొచ్చి వంగుతున్నది వంపులన్నీ వయసొచ్చి పొంగుతున్నవి వయసు తోటి మనసేమో పోరుతున్నది వయసు తోటి మనసేమో పోరుతున్నది వలపులోనె రెండిటి ఒద్దికున్నది వలపులోనె రెండిటి ఒద్దికున్నది హే పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్లోయ్ నీ పైటకొంగు జారిందే గడుసు పిల్లా అహా కొంగు జారితేముంది కొంటె పిల్లోడా నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా కొడవలితో లేత గడ్డి కోసుకొంటివి కొంటె చూపుతో గుండె దూసుకొంటివి కొడవలితో లేత గడ్డి కోసుకొంటివి కొంటె చూపుతో గుండె దూసుకొంటివి గడ్డిమోపు తలపైన మోసుకొస్తిని గడుసువాడ్ని తలపుల్లో దాచుకొంటిని గడ్డిమోపు తలపైన మోసుకొస్తిని గడుసువాడ్ని తలపుల్లో దాచుకొంటిని అహా పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్లోయ్ నీ పైటకొంగు జారిందే గడుసు పిల్లా ఆఁ కొంగు జారితేముంది కొంటె పిల్లోడా నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి