చిత్రం: ఆత్మ బలం (1964)
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఘంటసాల, ,పి. సుశీల
సంగీతం: కె. వి. మహదేవన్
చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలికాడె సరసన ఉంటే. చెట్టాపట్టగ చేతులు పట్టి చెట్టు నీడకై పరుగిడుతుంటే… చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయీ చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయీ ఉరుములు పెళపెళ ఉరుముతు ఉంటే. మెరుపులు తళ తళ మెరుస్తు ఉంటే. మెరుపు వెలుగులో చెలి కన్నులలో బిత్తర చూపులు కనపడుతుంటే. చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయి చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయీ కారు మబ్బులు కమ్ముతు ఉంటే … కమ్ముతు ఉంటే. ఓ.ఓ.కళ్ళకు ఎవరూ కనపడకుంటే… కనపడకుంటే ఆ.కారు మబ్బులు కమ్ముతు ఉంటే … కమ్ముతు ఉంటే. ఓ.ఓ.కళ్ళకు ఎవరూ కనపడకుంటే… కనపడకుంటే ఆ జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకొని హత్తుకు పోతుంటే జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకొని హత్తుకు పోతుంటే చెప్పలేని ఆ హాయీ ఎంతో వెచ్చగ ఉంటుందోయీ… చెప్పలేని ఆ హాయీ ఎంతో వెచ్చగ ఉంటుందోయీ… చలి చలిగా గిలివెస్తుంటే. ఆ హా హా గిలిగింతలు పెడుతూ ఉంటే. ఓహోహో… చలి చలిగా గిలివెస్తుంటే. ఆ హా హా గిలిగింతలు పెడుతూ ఉంటే. ఓహోహో… చెలి గుండెయిలో రగిలే వగలే చెలి గుండెయిలో రగిలే వగలే చలిమంటలుగా అనుకుంటే… చెప్పలేనీ ఆ హాయీ ఎంతో వెచ్చగ ఉంటుందోయీ… చెప్పలేనీ ఆ హాయీ ఎంతో వెచ్చగ ఉంటుందోయీ… చిటపట చినుకులు పడుతూ ఉంటే. చెలికాడె సరసన ఉంటే. చెట్టాపట్టగ చేతులు పట్టి చెట్టు నీడకై పరుగిడుతుంటే… చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయీ చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయీ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి