7, జనవరి 2022, శుక్రవారం

Devullu : Vakratunda Mahakaya Song Lyrics (వక్రతుండ మహాకాయ)

చిత్రం: దేవుళ్ళు (2000)

రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: వందేమాతరం శ్రీనివాస్



వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభా నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా.... జయ జయ శుభకర వినాయక  శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక జయ జయ శుభకర వినాయక  శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక ఆ..ఆ..ఆ..ఆ బాహుదానదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహపరములనిడు మహానుభావా ఇష్టమైనది వదలిన నీకడ ఇష్టకామ్యములు తీర్చే గణపతి కరుణను కురియుచు వరముల నొసగుచు నిరతము పెరిగే మహాకృతి సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రామాణం ధర్మ దేవతకు నిలపును ప్రాణం విజయ కారణం విఘ్న నాశనం కాణిపాకమున నీ దర్శనం జయ జయ శుభకర వినాయక  శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక జయ జయ శుభకర వినాయక  శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక పిండి బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడివైనావు మాతా పితలకు ప్రదక్షిణముతో మహా గణపతిగా మారావు భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతివైనావు బ్రహ్మాండము నీ బొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు లాభము శుభము కీర్తిని కూర్వగ లక్ష్మీ గణపతివైనావు వేదపురాణములఖిలశాస్త్రములు కళలు చాటున నీ వైభవం వక్రతుండమే ఓంకారమని విభుదులు చేసే నీకీర్తనం జయ జయ శుభకర వినాయక  శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక జయ జయ శుభకర వినాయక  శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక ఆ..ఆ..ఆ..ఆ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి