Devullu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Devullu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

7, జనవరి 2022, శుక్రవారం

Devullu : Ayyappa Devaya Song Lyrics (అయ్యప్ప దేవాయ)

చిత్రం: దేవుళ్ళు (2000)

రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: వందేమాతరం శ్రీనివాస్




అయ్యప్ప దేవాయ నమః…అభయస్వరూపాయ నమః అయ్యప్ప దేవాయ నమః… అభయస్వరూపాయ నమః హరి హర పుత్ర నమః… కరుణా సముద్రాయ నమః నిజ భీర గంభీర శభరీ గిరీ శిఖర ఘన యోగ ముద్రాయ నమః పరమాణు హృదయాంతరాళ స్థితానంత బ్రహ్మండరూపాయ నమః అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః పద్దెనిమిది పడిమెట్ల పైకెక్కి గుడికేగు భక్తులకు ఎదురొచ్చె బంగారు స్వామి ఇరుముడులు స్పృశియించి శుభుమనుచు దీవించి జనకృందములచేరె జగమేలు స్వామి తన భక్తులొనరించు తప్పులకు తడబడి ఒక ప్రక్క ఒరిగెనా ఓంకార మూర్తి (స్వామియే శరణం అయ్యప్ప) స్వాములందరు తనకు సాయమ్ముకాగా ధీమంతుడైలేచె ఆ కన్నెస్వామి పట్టబంధము వీడి భక్తతటికై పరుగుపరుగున వచ్చె భువిపైకి నరుడై అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః ఘోర కీకారణ్య సంసార యాత్రికుల శరణుఘోషలు విని రోజూ శబరీశా పాపాలు దోషాలు ప్రక్షాళనము చేయు పంపానది తీర ఎరుమేలి వాసా నియమాల మాలతో సుగుణాల మెట్లపై నడిపించి కనిపించు అయ్యప్ప స్వామి మకర సంక్రాంతి సజ్యోతివై అరుదెంచి మహిమలను చూపించు మణికంఠ స్వామి కర్మబంధము బాపు ధర్మ శాస్త్ర కలి భీతి తొలగించు భూతాదినేత అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః ఆద్యంత రహితమౌ నీ విశ్వరూపం అజ్ఞాన తిమిరమ్మునణుచు శుభదీపం ఈ నాల్గు దిక్కులు పదునాల్గు భువనాలు పడిమెట్లుగా మారె ఇదో అపురూపం అమరులెల్లరు చేయ అమృతాభిషేకం నెరవేర్చుకో స్వామి నీదు సంకల్పం (ఓం) పదములకు మ్రొక్కగా ఒక్కొక్క లోకం అందుకో నక్షత్ర పుష్పాభిషేకం పంపానదీ తీర శంపాల పాతాళ పాపాత్మ పరిమార్చు స్వామి భక్తులను రక్షించు స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప శంభు విష్ణు తనయ శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప ఓం శాంతి శాంతి శాంతిః ఓం శాంతి శాంతి శాంతిః

Devullu : Maha Kanaka Durga Song Lyrics (మహా కనకదుర్గా)

చిత్రం: దేవుళ్ళు (2000)

రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు

గానం: ఎస్.జానకి

సంగీతం: వందేమాతరం శ్రీనివాస్


మహా కనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలితా శివానంద చరితా మహా కనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలితా శివానంద చరితా శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాదరి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూలశక్తి అష్టాదశ పీఠాలను అధిశక్తి మహా కనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలితా శివానంద చరితా ఓంకార రావాల అలల కృష్ణా తీరంలో  ఇంద్రకీల గిరిపైన వెలసెను కృత యుగములోన ఈ కొండపైన అర్జునుడు తపమును కావించెను పరమశివుని మెప్పించి పాశుపతం పొందెను విజయుడైన అర్జునుని పేరిట విజయవాడ అయినది ఈ నగరము జగములన్నీయు జేజేలు పలుకగా కనకదుర్గకైనది స్థిరనివాసము మేలిమి బంగారు ముద్ద పసుపు కలగలిపిన వెన్నెలమోము కోటి కోటి ప్రభాతాల అరుణిమయే కుంకుమ అమ్మ మనసుపడి అడిగి ధరించిన కృష్ణవేణి ముక్కుపుడక ప్రేమ కరుణ వాత్సల్యం కురిపించే దుర్గ రూపం ముక్కోటి దేవతలందరికీ ఇదియే ముక్తి దీపం మహా కనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలితా శివానంద చరితా దేవీ నవరాత్రులలో వేదమంత్ర పూజలలో స్వర్ణ కవచములు దాల్చిన కనకదుర్గాదేవి భవబందాలను బాపే బాలా త్రిపురసుందరి నిత్యానందము కూర్చే అన్నపూర్ణాదేవి లోకశాంతిని సంరక్షించే సుమంత్ర మూర్తి గాయత్రి అక్షయ సంపదలెన్నో అవని జనుల కందించే దివ్య రూపిణి మహాలక్ష్మి విద్యా కవన గాన మొసగు వేదమయి సరస్వతి ఆయురారోగ్యాలు భోగభాగ్యములు ప్రసాదించే మహాదుర్గ శత్రు వినాసిని శక్తి స్వరూపిని మహిషాసురమర్దిని విజయకారిణి అభయ రూపిణి శ్రీరాజరాజేశ్వరి  భక్తులందరికి కన్నుల పండుగ అమ్మా నీ దర్శనం దుర్గమ్మా  నీ దర్శనం మహా కనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలితా శివానంద చరితా మహా కనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలితా శివానంద చరితా

Devullu : Vakratunda Mahakaya Song Lyrics (వక్రతుండ మహాకాయ)

చిత్రం: దేవుళ్ళు (2000)

రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: వందేమాతరం శ్రీనివాస్



వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభా నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా.... జయ జయ శుభకర వినాయక  శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక జయ జయ శుభకర వినాయక  శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక ఆ..ఆ..ఆ..ఆ బాహుదానదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహపరములనిడు మహానుభావా ఇష్టమైనది వదలిన నీకడ ఇష్టకామ్యములు తీర్చే గణపతి కరుణను కురియుచు వరముల నొసగుచు నిరతము పెరిగే మహాకృతి సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రామాణం ధర్మ దేవతకు నిలపును ప్రాణం విజయ కారణం విఘ్న నాశనం కాణిపాకమున నీ దర్శనం జయ జయ శుభకర వినాయక  శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక జయ జయ శుభకర వినాయక  శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక పిండి బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడివైనావు మాతా పితలకు ప్రదక్షిణముతో మహా గణపతిగా మారావు భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతివైనావు బ్రహ్మాండము నీ బొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు లాభము శుభము కీర్తిని కూర్వగ లక్ష్మీ గణపతివైనావు వేదపురాణములఖిలశాస్త్రములు కళలు చాటున నీ వైభవం వక్రతుండమే ఓంకారమని విభుదులు చేసే నీకీర్తనం జయ జయ శుభకర వినాయక  శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక జయ జయ శుభకర వినాయక  శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక ఆ..ఆ..ఆ..ఆ

Devullu : Sirula Nosage Song Lyrics (సిరులునొసగి సుఖశాంతులు)

చిత్రం: దేవుళ్ళు (2000)

రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు

గానం: స్వర్ణలత, సుజాత

సంగీతం: వందేమాతరం శ్రీనివాస్


సిరులునొసగి సుఖశాంతులు కూర్చును షిరిడీ సాయి కథ మధుర మధుర మహిమాన్విత భోద సాయి ప్రేమ సుధ సిరులునొసగి సుఖశాంతులు కూర్చును షిరిడీ సాయి కథ మధుర మధుర మహిమాన్విత భోద సాయి ప్రేమ సుధ పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాధ పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాధ సిరులునొసగి సుఖశాంతులు కూర్చును షిరిడీ సాయి కథ మధుర మధుర మహిమాన్విత భోద సాయి ప్రేమ సుధ షిరిడి గ్రామములో ఒక బాలుని రూపములో  వేపచెట్టు కింద వేదాంతిగా కనిపించాడు తన వెలుగును ప్రసరించాడు పగలు రేయి ధ్యానం పరమాత్మునిలో లీనం పగలు రేయి ధ్యానం పరమాత్మునిలో లీనం ఆనందమే ఆహారం చేదు చెట్టు నీడయే గురు పీఠం ఎండకు వానకు కృంగకు ఈ చెట్టు క్రిందనే ఉండకు  సాయి........ సాయి రా మసీదుకు అని మహల్సాపతి పిలుపుకు మసీదుకు మారెను సాయి  అదే అయినది ద్వారకామయి అక్కడ అందరూ భాయి భాయి బాబా భోదల నిలయమదోయి  సిరులునొసగి సుఖశాంతులు కూర్చును షిరిడీ సాయి కథ మధుర మధుర మహిమాన్విత భోద సాయి ప్రేమ సుధ ఖురాను బైబులు గీత ఒకటని కులమత భేదము వద్దనే గాలివాన నొక క్షణమున ఆపే  ఉడికే అన్నము చేతితో కలిపే రాతి గుండెలను గుడులను చేసె నీటి దీపములను వెలిగించె పచ్చి కుండలో నీటిని తెచ్చి పూలమొక్కలకు పోసి నిండే వనమును పెంచి మధ్యలో అఖండ జ్యోతిని వెలిగించె కప్పకు పాముకు స్నేహం కలిపే తల్లి భాషకు అర్దం తెలిపె ఆర్తుల రోగాలను హరియించే భక్తుల బాదలు తాను భరించే ప్రేమ సహనం రెండు వైపులా ఉన్ననాడే గురుదక్షిణ అడిగే మరణం జీవికి మార్పును తెలిపే మరణించి తను మరలా బ్రతికె సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం  నీదని నాదని అనుకోవద్దనె ధునిలో ఊది విభూదిగనిచ్చె భక్తి వెల్లువలు జయ జయ ఘోషలు చావడి ఉత్సవమై సాగగా కంకడ హారతులందుకొని కలిపాపాలను కడుగగా సకల దేవతా స్వరూపుడై వేదశాస్త్రములకతీతుడై సద్గురువై జగద్గురువై సత్యం చాటే దత్తాత్రేయుడై భక్తుని ప్రాణం రక్షించుటకై జీవన సహచరి అని చాటిన తన ఇటుక రాయి తృటిలో పగులగా పరిపూర్ణుడై గురుపుర్ణిమై భక్తుల మనసులో చిరంజీవియై శరీర సేవాలంగన చేసి దేహము విడిచెను సాయి సమాధి అయ్యెను సాయి సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా శ్రీ సమర్ద సద్గురు సాయినాధ మహరాజ్