చిత్రం: గోవుల గోపన్న (1968)
సాహిత్యం: కొసరాజు
గానం: ఘంటసాల
సంగీతం: ఘంటసాల
పల్లవి:
ఓ...ఓ...ఓ...ఒ...ఒ...
వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా
వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా
గోమాతను నేనేరా నాతో సరిపోలవురా
వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా
చరణం: 1
కల్లాకపటం యెరుగని గంగీగోవును నేనూ
ఏది చెప్పినా కాదని ఎదురు చెప్పలేను
పారేసిన గడ్డి తినీ బ్రతుకు గడుపుతున్నాను
పారేసిన గడ్డి తినీ బ్రతుకు గడుపుతున్నాను
పరుల సేవకే సర్వం త్యాగం చేస్తున్నాను
వినరా వినరా నరుడా...తెలుసుకోర పామరుడా
చరణం: 2
కమ్మనైన గుమ్మపాలు కడవలతో ఇస్తున్నా
నా దూడల కాదని మీ కడుపులు నిండిస్తున్నా
వయసుడిగిననాడు నన్ను కటికివాని పాల్చేస్తే
వయసుడిగిననాడు నన్ను కటికివాని పాల్చేస్తే
ఉసురు గోలుపోయి మీకే ఉపయేగిస్తున్నాను
వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా
చరణం: 3
నా బిడ్డలు భూమిచీల్చి దుక్కి దున్నుతున్నవోయ్
నా యెరువున పైరు పెరిగి పంట పండుతున్నదోయ్
నా చర్మమె మీ కాలికి చెప్పులుగా మారునోయ్
నా చర్మమె మీ కాలికి చెప్పులుగా మారునోయ్
నా ఒళ్ళె ఢంకాలకు నాదము పుట్టించునోయ్
వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి