చిత్రం: సరిగమలు సంగీతం: బోంబే రవి రచన: వేటూరి సుందర రామ్మూర్తి గానం: కె జె ఏసుదాస్
స్వర రాగ గంగా ప్రవాహమే
అంగాత్మ సంధాన యోగమే ప్రాప్తే వసంతే త్రికాలికే పలికే కుహు గీతికా గాన సరసీరుహమాలికా !! స్వర రాగ !! గమపని గమపని గమపని గమపని మపనిస మపనిస మపనిస మపనిస పనిసగ సగసని సనిపమ పమగమ గ కొండల లోపల నిండిన నింగిలో ఉరిమెను మేఘం ఇన్నాళ్ళకి పిల్లన గ్రోవిలో పిలవని మోవిలో కురిసెను రాగం ఈనాటికి మట్టింటి రాయే మాణిక్యమైపోయె సంగీత రత్నాకరానా స్వర సప్తకాలే కెరటాలు కాగా ఆ గంగ పొంగింది లోన !! స్వర రాగ !! సని సని సగగస గసగస పమపమ మగమగ పమపమ నిసనిప సనిసని చైతన్య వర్ణాల ఈ చైత్ర సుమవీధి వినిపించు రాగాలనంతాలులే ఈ చక్రవాకాలు ఎగిరే చక్కోరాలు జగమంత విహరించు రాగాలులే పిలిచే శకుంతాలు పలికే దిగంతాలు పులకింతలా పుష్యరాగాలులే మలిసందె దీపాలు గుడిగంట నాదాలు మౌనాక్షరీ గాన వేదాలులే !! స్వర రాగ !!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి