15, జనవరి 2022, శనివారం

Gundamma Katha : Lechindi Nidra Lechindi Song Lyrics (లేచింది.. నిద్ర లేచింది)

చిత్రం: గుండమ్మ కథ (1962)

రచన: పింగళి

గానం: ఘంటసాల

సంగీతం: ఘంటసాల



లేచింది.. నిద్ర లేచింది మహిళా లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం.. లేచింది మహిళా లోకం ఎపుడో చెప్పెను వేమనగారు.. అపుడే చెప్పెను బ్రహ్మంగారు

ఎపుడో చెప్పెను వేమనగారు.. అపుడే చెప్పెను బ్రహ్మంగారు ఇపుడే చెబుతా యినుకో బుల్లెమ్మా !!

ఇపుడే చెబుతా యినుకో బుల్లెమ్మా విస్సన్న చెప్పిన వేదం కూడా... లేచింది.. నిద్ర లేచింది మహిళా లోకం

పల్లెటూళ్ళలో పంచాయితీలు.. పట్టణాలలో ఉద్యోగాలు పల్లెటూళ్ళలో పంచాయితీలు.. పట్టణాలలో ఉద్యోగాలు అది ఇది ఏమని అన్ని రంగములా అది ఇది ఏమని అన్ని రంగములా మగధీరులనెదిరించారు.. నిరుద్యోగులను పెంచారు !! లేచింది.. నిద్ర లేచింది మహిళా లోకం

చట్టసభలలో సీట్లకోసం.. భర్తలతోనే పోటీచేసి చట్టసభలలో సీట్లకోసం.. భర్తలతోనే పోటీచేసి ఢిల్లీ సభలో పీఠంవేసి ఢిల్లీ సభలో పీఠంవేసి లెక్చరులెన్నో దంచారు.. విడాకు చట్టం తెచ్చారు !!

లేచింది.. నిద్ర లేచింది మహిళా లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం.. లేచింది.. నిద్ర లేచింది. నిద్ర లేచింది మహిళా లోకం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి