చిత్రం: గుండమ్మ కథ (1962)
రచన: పింగళి
గానం: ఘంటసాల,పి. సుశీల
సంగీతం: ఘంటసాల
పల్లవి:
కోలుకోలోయన్న కోలో నాసామి కొమ్మలిద్దరు మాంచి జోడు
కోలుకోలోయన్న కోలో నాసామి కొమ్మలిద్దరు మాంచి జోడు
మేలుమేలోయన్న మేలో నారంగ కొమ్మలకు వచ్చింది ఈడు ...
మేలుమేలోయన్న మేలో నారంగ కొమ్మలకు వచ్చింది ఈడు .
ఈ ముద్దుగుమ్మలకు చూడాలి జోడు!
ఆహాహా... ఆ ఆ ఆ... ఓహొహో... ఓ ఓ ఓ...
చరణం 1:
బాలబాలోయన్న బాలో చిన్నమ్మి అందాల గారాల బాల
బాలబాలోయన్న బాలో చిన్నమ్మి అందాల గారాల బాల
బేలబేలోయన్న బేలో పెద్దమ్మి చిలకలా కులికేను చాలా
బేలబేలోయన్న దిద్దినకదిన దిద్దినకదిన దిద్దినకదిన దిన్ .హేయ్.
బేలబేలోయన్న బేలో పెద్దమ్మి చిలకలా కులికేను చాలా .
ఈ బేల పలికితే ముత్యాలు రాల. ఊ.ఊ.ఊ...
కోలుకోలోయన్న కోలో నాసామి కొమ్మలిద్దరు మాంచి జోడు
ఆహాహా... ఆ ఆ ఆ... ఓహొహో... ఓ ఓ ఓ...
చరణం 2:
ముక్కుపైనుంటాది కోపం చిట్టెమ్మ మనసేమొ మంచిదే పాపం... ముక్కుపైనుంటాది కోపం చిట్టెమ్మ మనసేమొ మంచిదే పాపం.ఓ.ఓ.ఓ. ఇంటికి వెలుగైన దీపం బుల్లెమ్మ కంటచూసిన పోవు తాపం ఇంటికి వెలుగైన దీపం బుల్లెమ్మ కంటచూసిన పోవు తాపం . జంటుంటే ఎందు రానీదు ఏ లోపం... ఊ.ఊ.ఊ. కోలుకోలోయన్న కోలో నాసామి కొమ్మలిద్దరు మాంచి జోడు ఆహాహా... ఆ ఆ ఆ... ఓహొహో... ఓ ఓ ఓ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి