చిత్రం: గుండమ్మ కథ (1962)
రచన: పింగళి
గానం: ఘంటసాల,పి. లీల
సంగీతం: ఘంటసాల
పల్లవి:
వేషము మార్చెను...భాషను మార్చెను మోసము నేర్చెను..అసలు తానే మారెను ఐనా..మనిషి మారలేదు ఆతని మమత తీరలేదు మనిషి మారలేదు ఆతని మమత తీరలేదు
చరణం 1:
క్రూరమృగమ్ముల కోరలు తీసెను ఘోరారణ్యములాక్రమించెను క్రూరమృగమ్ముల కోరలు తీసెను ఘోరారణ్యములాక్రమించెను హిమాలయముపై జెండా పాతెను హిమాలయముపై జెండా పాతెను ఆకాశంలో షికారు చేసెను ఐనా..మనిషి మారలేదు ఆతని కాంక్ష తీరలేదు
చరణం 2:
పిడికిలి మించని హృదయములో కడలిని మించిన ఆశలు దాచెను పిడికిలి మించని హృదయములో కడలిని మించిన ఆశలు దాచెను వేదికలెక్కెను వాదముచేసెను వేదికలెక్కెను వాదముచేసెను త్యాగమే మేలని బోధలు చేసెను ఐనా మనిషి మారలేదు ఆతని బాధ తీరలేదు
వేషమూ మార్చెను...భాషనూ మార్చెను మోసము నేర్చెను.. తలలే మార్చెను ఐనా..మనిషి మారలేదు ఆతని మమత తీరలేదు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి