27, జనవరి 2022, గురువారం

Hitler : O Kaalama Song Lyrics (ఓ. కాలమా )

చిత్రం: హిట్లర్ (1997)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: జేసుదాస్

సంగీతం: కోటి




ఎందరిని ఏ దరికి చేర్చినా సంద్రాన ఒంటరిగా మిగలదా నావా... ఆ... ఓ... కాలమా ఇది నీ జాలమా... ఓ కాలమా ఇది నీ జాలమా... మమతలు పెంచి మనసులు విరిచి చలగాటమాడతావు న్యాయమా... ఓఓ ఓఓ.ఓఓ... ఓ. కాలమా ఇది నీ జాలమా... ఓ... కాలమా ఇది నీ జాలమా... రెక్కలోచ్చి గువ్వలు ఎగిరి వెళ్ళి పోయినా... గూటి గుండెలో ఇలా ఈక గుచ్చి వెళ్ళవే... ముళ్ళు చెట్టు కొమ్మలైన ఏంత పైకి వెళ్ళినా... తల్లి వేరు పైనా కత్తి దూసి ఉండవే... మీరే తన లోకమని బ్రతికిన సోదరునీ... చాల్లే ఇక వెళ్ళమని తరిమిన మిన్నుగనీ... అనురాగమేంత చిన్నబొయేనో... ఓ... ఓ... ఓ... కాలమా ఇది నీ జాలమా... ఓ... కాలమా ఇది నీ జాలమా... నారు పోసి దేవుడు నీరు పోయలేదనీ... నెత్తురంతా దారపోసి పెంచడమే పాపమా... యేరు దాటి వెంటనే పడవ కాచ్చు వారిలా... అయిన వాళ్ళు మారిపోతే అంతకన్నా శాపమా... నిన్నే తమ దైవమని కొలిచిన వారేనా... యముడై వెదించకని నిన్ను వెలివేసేనా... అనుబంధమింత నేర మాయెనా... ఓఓ... ఓఓ... ఓ... ఓ... కాలమా ఇది నీ జాలమా... ఓ కాలమా ఇది నీ జాలమా... మమతలు పెంచి మనసులు విరిచి చలగాటమాడతావు న్యాయమా... ఓఓ ఓఓ.ఓఓ...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి