19, జనవరి 2022, బుధవారం

Mangalya Balam : Vaadina Poole Song Lyrics (వాడిన పూలే వికసించెనే)

చిత్రం: మాంగళ్యబలం (1960)

సంగీతం: మాస్టర్ వేణు రచన: శ్రీ శ్రీ గాయకులు: సుశీల, ఘంటసాల



పల్లవి:

వాడిన పూలే వికసించెనే వాడిన పూలే వికసించెనే చెర వీడిన హృదయాలు పులకించెనే..ఏ..ఏ.. వాడిన పూలే వికసించెనే తీయని కలలే ఫలియించెనే తీయని కలలే ఫలియించెనే యెల కొయిల తన గొంతు సవరించెనే..ఏ..ఏ... తీయని కలలే ఫలియించెనే

చరణం 1:

వేయిరేకులు విరిసింది జలజం తీయ తేనియ కొసరింది భ్రమరం లోకమే ఒక వుద్యానవనము... లోటు లేదిక మనదే సుఖము ... తీయని కలలే ఫలియించెనే యెల కొయిల తన గొంతు సవరించెనే..ఏ..ఏ... తీయని కలలే ఫలియించెనే

చరణం 2:

పగలే జాబిలి ఉదయించెనేలా.. వగలే చాలును పరిహాసమేలా... పగలే జాబిలి ఉదయించెనేలా... వగలే చాలును పరిహాసమేలా... తేట నీటను నీ నవ్వు మొగమే తేలియాడెను నెల రేని వలెనే.. వాడిన పూలే వికసించెనే చెర వీడిన హృదయాలు పులకించెనే..ఏ..ఏ.. వాడిన పూలే వికసించెనే

చరణం 3:

జీవితాలకు నేడే వసంతం... చేదిరిపోవని ప్రేమానుబంధం ఆలపించిన ఆనంద గీతం... ఆలకించగ మధురం మధురం ... వాడిన పూలే వికసించెనే చెర వీడిన హృదయాలు పులకించెనే..ఏ..ఏ.. వాడిన పూలే వికసించెనే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి