18, జనవరి 2022, మంగళవారం

Abhimanam : Oho basti dorasani song Lyrics ( ఓహో బస్తీ దొరసాని)

చిత్రం: అభిమానం (1959)
సంగీతం: ఘంటసాల
గీతరచయిత: సముద్రాల (జూనియర్)
నేపధ్య గానం: ఘంటసాల, జిక్కి

ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయ్యిందీ అందచందాల వన్నేలాడి ఎంతో బాగుంది. ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయ్యిందీ అందచందాల వన్నేలాడి ఎంతో బాగుంది... ఓహో బస్తీ దొరసాని. ముచ్చటైన కురులను దువ్వి పూలదండ ముడిచింది పూలదండతో బాటే మూతి కూడ ముడిచింది హాయ్! ముచ్చటైన కురులను దువ్వి పూలదండ ముడిచింది పూలదండతో బాటే మూతి కూడ ముడిచింది హాయ్! ఆపై కోపం వచ్చింది. వచ్చిన కోపం హెచ్చింది అందచందాల వన్నెలాడి అయినా బాగుంది ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయ్యిందీ అందచందాల వన్నేలాడి ఎంతో బాగుంది... ఓహో బస్తీ దొరసాని. కొత్త పెళ్ళికూతురి మదిలో కొసరు సిగ్గు వేసింది మత్తు మత్తు కన్నులతోను మనసు తీర చూసింది హాయ్! కొత్త పెళ్ళికూతురి మదిలో కొసరు సిగ్గు వేసింది మత్తు మత్తు కన్నులతోను మనసు తీర చూసింది ఆమెకు సరదా వేసింది జరిగి దగ్గరకొచ్చింది అందచందాల వన్నెలాడి కోపం పోయింది ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయ్యిందీ అందచందాల వన్నేలాడి ఎంతో బాగుంది... ఓహో బస్తీ దొరసాని. పడుచువాళ్ళ పాటలతోనే పల్లెసీమ పండింది. పల్లెసీమలో హాయి వెల్లివిరిసి నిండింది. హాయ్! పడుచువాళ్ళ పాటలతోనే పల్లెసీమ పండింది పల్లెసీమలో హాయి వెల్లివిరిసి నిండింది... హాయ్! చివరకు చిలిపిగ నవ్వింది... చేయి చేయి కలిపింది అందచందాల వన్నెలాడి ఆడి పాడింది ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయ్యిందీ అందచందాల వన్నేలాడి ఎంతో బాగుంది... ఓహో బస్తీ దొరసాని.ఓహో బస్తీ దొరసాని.ఓహో బస్తీ దొరసాని...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి