చిత్రం: నర్తనశాల(1963)
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య
గానం: పి. సుశీల
సంగీతం: సుసర్ల దక్షిణా మూర్తి
జనని శివ కామిని జయ సుభ కారిణి విజయ రూపిని జనని శివకామిని అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్న అమ్మవు నీవే అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్న అమ్మవు నీవే నీ చరణములే నమ్మితి నమ్మ ….. నీ చరణములే నమ్మితి నమ్మ శరణము కోరితి అమ్మ భవానీ.. జనని శివ కామిని జయ సుభ కారిణి విజయ రూపిని జనని శివకామిని నీ దరినున్న తొలగు భయాలు నీ దయలున్న కలుగు జయాలు నీ దరినున్న తొలగు భయాలు నీ దయలున్న కలుగు జయాలు నిరతము మాకు నీడగా నిలిచి ….. నిరతము మాకు నీడగా నిలిచి ….. జయము నీయవే అమ్మ..
జయము నీయవే అమ్మ భవాని
జనని శివ కామిని జయ సుభ కారిణి విజయ రూపిని జనని శివకామిని..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి