Narthanasala లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Narthanasala లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

28, డిసెంబర్ 2024, శనివారం

Narthanashala : Sakhiyaa vivarinchave Song lyrics (సఖియా వివరించవే)

చిత్రం: నర్తనశాల(1963)

సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య

గానం: పి. సుశీల

సంగీతం: సుసర్ల దక్షిణా మూర్తి


సఖియా వివరించవే
వగలెరిగిన చెలునికి .. నా కథా
సఖియా వివరించవే

నిన్ను చూసి కనులు చెదరి..
కన్నె మనసు కానుక చెసి..
మరువలెక మనసు రాక
విరహాన చెలికాన వేగేనని

సఖియా..

మల్లె పూల మనసు దోచి
పిల్ల గాలి వీచె వేల
ఆ. ఆ..

కలువరేని వెలుగు లోన సరసాల సరదాలు తీరెనని
సఖియా..

12, ఫిబ్రవరి 2022, శనివారం

Narthanashala : Dhariki Raabhoku Song Lyrics (దరికి రాబోకు రాబోకు రాజా)

చిత్రం: నర్తనశాల(1963)

సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య

గానం: పి. సుశీల

సంగీతం: సుసర్ల దక్షిణా మూర్తి


దరికి రాబోకు రాబోకు రాజా !! దరికి రాబోకు రాబోకు రాజా !! ఓ.. తేటి రాజా వెర్రి రాజా దరికి రాబోకు రాబోకు రాజా !!

మగువ మనసు కానగలేవు తగని మారాలు మానగలేవు మగువ మనసు కానగలేవు తగని మారాలు మానగలేవు నీకీనాడే మంగళమౌరా నీకీనాడే మంగళమౌరా ఆశా భరించి తరించేవులే దరికి రాబోకు రాబోకు రాజా !! దరికి రాబోకు రాబోకు రాజా !!

మరుని శరాల తెలివి మాలి పరువు పోనాది చేరగ రాకు మరుని శరాల తెలివి మాలి పరువు పోనాది చేరగ రాకు నీవేనాడు కనని వినని నీవేనాడు కనని వినని శాంతి సుఖాల తేలేవులే దరికి రాబోకు రాబోకు రాజా !! దరికి రాబోకు రాబోకు రాజా !!

ఓ.. తేటి రాజా వెర్రి రాజా

28, జనవరి 2022, శుక్రవారం

Narthanashala : Janani Shiva Kamini Song Lyrics (జనని శివ కామిని )

చిత్రం: నర్తనశాల(1963)

సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య

గానం: పి. సుశీల

సంగీతం: సుసర్ల దక్షిణా మూర్తి



జనని శివ కామిని జయ సుభ కారిణి విజయ రూపిని జనని శివకామిని అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్న అమ్మవు నీవే అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్న అమ్మవు నీవే నీ చరణములే నమ్మితి నమ్మ ….. నీ చరణములే నమ్మితి నమ్మ శరణము కోరితి అమ్మ భవానీ.. జనని శివ కామిని జయ సుభ కారిణి విజయ రూపిని జనని శివకామిని నీ దరినున్న తొలగు భయాలు నీ దయలున్న కలుగు జయాలు నీ దరినున్న తొలగు భయాలు నీ దయలున్న కలుగు జయాలు నిరతము మాకు నీడగా నిలిచి ….. నిరతము మాకు నీడగా నిలిచి ….. జయము నీయవే అమ్మ..

జయము నీయవే అమ్మ భవాని

జనని శివ కామిని జయ సుభ కారిణి విజయ రూపిని జనని శివకామిని..

21, జనవరి 2022, శుక్రవారం

Narthanashala : Naravara O Kuravara Song Lyrics (నరవరా ఓ కురువరా )

చిత్రం: నర్తనశాల(1963)

సాహిత్యం: సముద్రాల

గానం: ఎస్.జానకి

సంగీతం: సుసర్ల దక్షిణా మూర్తి



నరవరా... ఆ..ఆ...ఆ.. నరవరా ఓ కురువరా నరవరా ఓ కురువరా వీరుల నీకు సరి.. లేరని సరసులలో.. జాణవని విన్నారా.. కన్నారా విన్నారా.. కన్నారా కనులారా నరవరా ఓ కురువరా

సురపతీ నెదిరించి రణాన పశుపతీ మురుపించి బళాన సురపతీ నెదిరించి రణాన పశుపతీ మురుపించి బళాన సాటిలేని వీరుండన్న యశమును గన్నా సాటిలేని వీరుండన్న యశమును గన్నా అర్జున ఫల్గుణ పార్థ కిరీటి బిరుదుగొన్న విజయా నరవరా ఓ కురువరా

నినుగని తలవూచే ఉలూచి కొనుమని చేయిచాచే సుభద్రా నినుగని తలవూచే ఉలూచి కొనుమని చేయిచాచే సుభద్రా నీదు వన్నె చిన్నె గన్న చెలువల మిన్న నీదు వన్నె చిన్నె గన్న చెలువల మిన్న అలరుల విలుతుని మొలుకుల గురియై వలపులమ్ముకొనురా 


నరవరా ఓ కురువరా నరవరా ఓ కురువరా వీరుల నీకు సరి.. లేరని సరసులలో.. జాణవని విన్నారా.. కన్నారా విన్నారా.. కన్నారా కనులారా నరవరా ఓ కురువరా