28, జనవరి 2022, శుక్రవారం

Pasivadi Pranam : Idedo Golaga Unde Song Lyrics (ఇదేదో గోలగా ఉంది)

చిత్రం: పసివాడి ప్రాణం (1987)

సాహిత్యం: వేటూరి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి

సంగీతం: చక్రవర్తి



ఇదేదో గోలగా ఉంది ఎదంతా వేడిగా ఉంది అదేం గుబులో ఇదేం తెగులో ఇదేనా ఈడంటే..హోయ్ ఇదేదో గోలగా ఉంది నీ మీదే గాలి మళ్ళింది ఒకే చొరవ ఒకే గొడవ అదేలే ఈడంటే..హ ఒంటిగా పడుకోనీదు కంటికే మత్తు రానీదు అదే ధ్యాస అదే ఆశ నేనాగదెట్టాగ పువ్వులే పెట్టుకోనీదు బువ్వనే ముట్టూకోనీదు అదేం పాడో ఇదేం గోడో నే వేగేదెట్టాగ ఉరికే తహతహమంటాది ఊపిరే చలిచలిగుంటాది అదేం సెగలో ఇదేం పొగలో అదేలే ఈడంటే..హే ఇదేదో గోలగా ఉంది ఎదంతా వేడిగా ఉంది ఒకే చొరవ ఒకే గొడవ అదేలే ఈడంటే..హ బుగ్గకే సిగ్గు రాదాయే మనసుకే బుద్ది లేదాయే అదే రాత్రి అదే పగలు నే చచ్చేదెట్టాగ చెప్పినా ఊరుకోదాయే వాయిదా వెయ్యనీదాయే అదేం కిలకో అదేం కులుకో నే బతికేదేట్టాగ రెప్పలో రెపరెపగుంటాది రేతిరే కాల్చుకు తింటాది అవేం కలలో అవేం కథలో అదేలే ప్రేమంటే..హోయ్ ఇదేదో గోలగా ఉంది నీ మీదే గాలి మళ్ళింది ఒకే చొరవ ఒకే గొడవ అదేలే ఈడంటే..హ ఇదేదో గోలగా ఉంది ఎదంతా వేడిగా ఉంది అదేం గుబులో ఇదేం తెగులో ఇదేనా ఈడంటే..హోయ్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి