Pasivadi pranam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Pasivadi pranam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, ఏప్రిల్ 2022, శుక్రవారం

Pasivadi Pranam : Chakkani chukka song lyrics (చక్కని చుక్కల)

చిత్రం: పసివాడి ప్రాణం (1987)

సాహిత్యం: వేటూరి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి

సంగీతం: చక్రవర్తి



స్వీటీ... స్వీటీ హో హో... చక్కని చుక్కల సందిట break dance చక్కిలిగింతల చాటున shake dance నీ పిట్ట నడుమున పుట్టిన folk dance నీ బుట్ట అడుగున సాగిన snake dance ఇద్దరి దరువుకు మద్దెల break dance Break break break స్వీటీ స్వీటీ yeah హే నీ అందం అరువిస్తావా, నా సొంతం కానిస్తావా నీ సత్తా చూపిస్తావా, సరికొత్త ఊపిస్తావా హోయ్ పిల్లా నిన్నాల్లాడిస్తా పిడుగంటి అడుగుల్లో పై తాళం పరుగుల్లో Break break break స్వీటీ స్వీటీ చక్కని చుక్కల సందిట break dance చక్కిలిగింతల చాటున shake dance నా ముక్కును శృతి చేస్తావా నా మువ్వకు లయలిస్తావా నా చిందుకు చిటికేస్తావా నా పొందుకు చిత్తౌతావా పిల్లాడా నిన్నోడిస్తా కడగంటి చూపుల్తో కైపెక్కే తైతక్కల్లో Break break break naughty naughty చక్కని చుక్కల సందిట break dance చక్కిలిగింతల చాటున shake dance నీ పిట్ట నడుమున పుట్టిన folk dance నీ బుట్ట అడుగున సాగిన snake dance ఇద్దరి దరువుకు మద్దెల break dance Break break break స్వీటీ స్వీటీ yeah

28, జనవరి 2022, శుక్రవారం

Pasivadi Pranam : Idedo Golaga Unde Song Lyrics (ఇదేదో గోలగా ఉంది)

చిత్రం: పసివాడి ప్రాణం (1987)

సాహిత్యం: వేటూరి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి

సంగీతం: చక్రవర్తి



ఇదేదో గోలగా ఉంది ఎదంతా వేడిగా ఉంది అదేం గుబులో ఇదేం తెగులో ఇదేనా ఈడంటే..హోయ్ ఇదేదో గోలగా ఉంది నీ మీదే గాలి మళ్ళింది ఒకే చొరవ ఒకే గొడవ అదేలే ఈడంటే..హ ఒంటిగా పడుకోనీదు కంటికే మత్తు రానీదు అదే ధ్యాస అదే ఆశ నేనాగదెట్టాగ పువ్వులే పెట్టుకోనీదు బువ్వనే ముట్టూకోనీదు అదేం పాడో ఇదేం గోడో నే వేగేదెట్టాగ ఉరికే తహతహమంటాది ఊపిరే చలిచలిగుంటాది అదేం సెగలో ఇదేం పొగలో అదేలే ఈడంటే..హే ఇదేదో గోలగా ఉంది ఎదంతా వేడిగా ఉంది ఒకే చొరవ ఒకే గొడవ అదేలే ఈడంటే..హ బుగ్గకే సిగ్గు రాదాయే మనసుకే బుద్ది లేదాయే అదే రాత్రి అదే పగలు నే చచ్చేదెట్టాగ చెప్పినా ఊరుకోదాయే వాయిదా వెయ్యనీదాయే అదేం కిలకో అదేం కులుకో నే బతికేదేట్టాగ రెప్పలో రెపరెపగుంటాది రేతిరే కాల్చుకు తింటాది అవేం కలలో అవేం కథలో అదేలే ప్రేమంటే..హోయ్ ఇదేదో గోలగా ఉంది నీ మీదే గాలి మళ్ళింది ఒకే చొరవ ఒకే గొడవ అదేలే ఈడంటే..హ ఇదేదో గోలగా ఉంది ఎదంతా వేడిగా ఉంది అదేం గుబులో ఇదేం తెగులో ఇదేనా ఈడంటే..హోయ్

15, జూన్ 2021, మంగళవారం

Pasivadi Pranam : Andham Saranam Ghachami Song (అందం శరణం గచ్చామి అధరం శరణం గచ్చామి)

చిత్రం: పసివాడి ప్రాణం (1987)

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ,పి. సుశీల

సంగీతం: చక్రవర్తి


అందం శరణం గచ్చామి అధరం శరణం గచ్చామి ఈ సాయంత్రం వేళ నీ ఏకాంత సేవ అతి మధురం అనురాగం ఒదిగే వయ్యారం ప్రణయం శరణం గచ్చామి హృదయం శరణం గచ్చామి ఈ సింధూర వేళ నీ శృంగార లీల సుఖ శిఖరం శుభయోగం అది నా సంగీతం ఎంతకూ తీరని ఎదలో ఆశలేమో అడగరానిదై చెప్పరానిదై పెదవుల అంటింతనై మాటతో తీరని మదిలో దాహమే చిలిపి ముద్దుకై చినుకు తేనేకై కసి కసి కవ్వింతలై నీ నవ్వు నాలో నాట్యాలు చేసే కౌగిట్లో సోకమ్మ వాకిట్లో తెరిచే గుప్పిల్లలోన ప్రణయం శరణం గచ్చామి హృదయం శరణం గచ్చామి చూపుతో గిచ్చక వయసే లేతదమ్మా వలపు గాలికే వాడుతున్నది విసరకు పూబాణమే చేసుకో మచ్చిక వరసే కొత్తదమ్మా చలికి రేగినా ఒడికి చేరినా చెరిసగమీ ప్రాణమే నీ ఊపిరే నాలో పూలారబోసే అందాలో నా ప్రేమ గంధాల్లో ముసిరే ముంగిళ్లలో అందం శరణం గచ్చామి హృదయం శరణం గచ్చామి ఈ సాయంత్రం వేళ నీ ఏకాంత సేవ సుఖ శిఖరం శుభయోగం అది నా సంగీతం

9, జూన్ 2021, బుధవారం

Pasivadi Pranam : Kaashmiru Loyalo Song Lyrics (కాశ్మీరులోయలో కన్యాకుమారిరో)

చిత్రం: పసివాడి ప్రాణం (1987)

సాహిత్యం: వేటూరి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి

సంగీతం: చక్రవర్తి


కాశ్మీరులోయలో కన్యాకుమారిరో ఓ సందమామ ఓ సందమామ కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో ఓ సందమామ ఓ సందమామ పొగరాని కుంపట్లు రగిలించినాదే పొగరెక్కి చలికాన్ని తగలేసినాడే చెమ్మాచెక్కా చేత చిక్క మంచుమల్లె మారిపోయే మంచు కొండలు మంచిరోజు మార్చమంది మల్లె దండలు కాశ్మీరులోయలో కన్యాకుమారిరో ఓ సందమామ ఓ సందమామ కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో ఓ సందమామ ఓ సందమామ తేనేటి వాగుల్లో తెడ్డేసుకో పూలారబోసేటి ఒడ్డందుకో శృంగార వీధుల్లో చిందేసుకో మందార బుగ్గల్ని చిదిమేసుకో సూరీడుతో ఈడు చలికాచుకో ముద్దారిపోయాక పొద చేరుకో గుండెలోనే పాగా గుట్టుగా వేశాకా గుట్టమైన సోకు నీదే కాదా అరె తస్సా చెక్కా ఆకు వక్క ఇచ్చుకోక ముందే ముట్టె తాంబూలము పెళ్ళి కాక ముందే జరిగే పేరంటము కాశ్మీరులోయలో కన్యాకుమారిరో ఓ సందమామ ఓ సందమామ కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో ఓ సందమామ ఓ సందమామ సింధూర రాగాలు చిత్రించుకో అందాల గంధాల హాయందుకో పన్నీటి తానాలు ఆడేసుకో పరువాలు నా కంట ఆరేసుకో కాశ్మీరు చిలకమ్మ కసి చూసుకో చిలక పచ్చ రైక బిగి చూసుకో గూటి పడవల్లోన చాటుగా కలిశాక నీటికైనా వేడి పుట్టాలిలే పుత మొగ్గ లేత బుగ్గ సొట్టబడ్డ చోట పెట్టు నీ ముద్దులు హే సొంతమైన చోట లేవు ఏ హద్దులు అరె కాశ్మీరులోయలో కన్యాకుమారిరో ఓ సందమామ ఓ సందమామ కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో ఓ సందమామ ఓ సందమామ పొగరాని కుంపట్లు రగిలించినాదే పొగరెక్కి చలికాన్ని తగలేసినాడే చెమ్మాచెక్కా చేత చిక్క మంచుమల్లె మారిపోయే మంచు కొండలు మంచిరోజు మార్చమంది మల్లె దండలు