చిత్రం: పెద్దరికం (1992)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: జేసుదాస్
ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కధనం

పగేమో ప్రాణమయ్యేనా ప్రేమలే దూరమయ్యేనా
నిరాశే నింగికెగసేనా ఆశలే రాలిపోయేనా

ఒడిలో పెరిగిన చిన్నారిని ఎరగా చేసినదా ద్వేషము
కధ మారదా ఈ బలి ఆగదా
మనిషే పశువుగా మారితే కసిగా శిశువుని కుమ్మితే

ఆభమో శుభమో ఎరుగని వలపులు ఓడిపోయేనా
ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కధనం
పగేమో ప్రాణమయ్యేనా ప్రేమలే దూరమయ్యేనా
నిరాశే నింగికెగసేనా ఆశలే రాలిపోయేనా
ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కధనం
విరిసి విరియని పూదోటలో రగిలే మంటలు చల్లరవా
అర్పేదెలా ఓదార్చేదెలా
నీరే నిప్పుగ మారితే వెలుగే చీకటి రువ్వితే

పొగలో సెగలో మమతల పూవులు కాలిపోయేనా
ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కధనం
పగేమో ప్రాణమయ్యేనా ప్రేమలే దూరమయ్యేనా
నిరాశే నింగికెగసేనా ఆశలే రాలిపోయేనా
ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కధనం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి