చిత్రం: పెద్దరికం (1992)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
నీ నవ్వే చాలు పూబంతీ చామంతీ.. ప్రేమించా నిన్ను వాసంతీ మాలతీ.. ఆ మాటే చాలు నెలవంకా రా ఇకా ప్రేమిస్తా నిన్ను సందేహం లేదికా విలాసాల దారి కాచా సరాగాల గాలమేసా ఉల్లాసాల పూలు కోసా వయ్యారాల మాల వేసా మరో నవ్వు రువ్వరాదటే నీ నవ్వే చాలు పూబంతీ చామంతీ ప్రేమించా నిన్ను వాసంతీ మాలతీ మల్లె పూల మంచమేసీ హుషారించనా జమాయించి జాజి మొగ్గా నిషా చూడనా తెల్లచీర టెక్కులేవో చలాయించనా విర్రవీగు కుర్రవాణ్ణి నిఘాయించనా అతివకు ఆత్రము తగదటగా తుంటరి చేతులు విడవవుగా మనసుపడే పడుచు ఒడీ.. ఓ..ఓ..ఓ..ఓ ఓ..ఓ..ఓ..ఓ * నీ నవ్వే చాలు పూబంతీ చామంతీ ప్రేమించా నిన్ను వాసంతీ మాలతీ కోరమీసమున్న వాడీ కసే చూడనా దోరదోర జామపళ్ళ రుచే చూపనా కొంగు చాటు హంగులన్నీ పటాయించనా రెచ్చి రేగు కుర్రదాన్నీ ఖుమాయించనా పరువము పరుతుల పరమటగా వయసున సరసము సులువటగా తధగినతోం మొదలెడదాం... ఓ..ఓ..ఓ..ఓ ఆ..ఆ..ఆ * నీ నవ్వే చాలు పూబంతీ చామంతీ ప్రేమించా నిన్ను వాసంతీ మాలతీ... విలాసాల దారి కాచా సరాగాల గాలమేసా ఉల్లాసాల పూలు కోసా వయ్యారాల మాల వేసా మరో నవ్వు రువ్వరాదటే నీ నవ్వే చాలు పూబంతీ చామంతీ ఆ మాటే చాలు నెలవంకా రా ఇకా