చిత్రం: పెళ్ళినాటి ప్రమాణాలు (1958)
సాహిత్యం: పింగళి
గానం: ఘంటసాల, పి. లీల
సంగీతం: ఘంటసాల
వెన్నెలలోనే వేడి ఏలనో.... వేడిమిలోనే చల్లనేలనో... ఏమాయె ఏమో జాబిలి ... ఈ మాయ ఏమో జాబిలి వెన్నెలలోనే విరహమేలనో... విరహములోనే హాయి ఏలనో... ఏమాయె ఏమో జాబిలి... ఈ మాయ ఏమో జాబిలి మొన్నటికన్నా నిన్న వింతగ... నిన్నటికన్నా నేడు వింతగ ఓ..ఓహొ..ఓ..ఓహొ... మొన్నటికన్నా నిన్న వింతగ... నిన్నటికన్నా నేడు వింతగ నీ సొగసూ నీ వగలూ... హాయిహాయిగా వెలసేనే వెన్నెలలోనే వేడి ఏలనో.... వేడిమిలోనే చల్లనేలనో... ఏమాయె ఏమో జాబిలి ... ఈ మాయ ఏమో జాబిలి రూపముకన్నా చూపు చల్లగా... చూపులకన్నా చెలిమి కొల్లగా... ఓహొ..ఓ..ఓహొ..ఓ.. రూపముకన్నా చూపు చల్లగా... చూపులకన్నా చెలిమి కొల్లగా.. నీ కళలూ.. నీ హొయలు... చల్లచల్లగా విరిసేనే వెన్నెలలోనే హాయి ఏలనో... వెన్నెలలోనే విరహమేలనో.. ఏమాయె ఏమో జాబిలి... ఈ మాయ ఏమో జాబిలి ఆ..ఆహ..ఆ..ఆ..అహ..ఆ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి