చిత్రం: దేవత (1965)
సాహిత్యం: వేటూరి
గానం: ఘంటసాల, పి. సుశీల
సంగీతం: యస్.పి. కోదండపాణి
కన్నుల్లో మిసమిసలు కనిపించనీ గుండెల్లో గుసగుసలు వినిపించనీ కన్నుల్లో మిసమిసలు కనిపించనీ నీ చూపుతో నన్ను ముడివేయకూ ఈ పూలు వింతాయె తడిచేయకూ నీ చూపుతో నన్ను ముడివేయకూ సెలయేరు నవ్వుతుంది చిరుగాలి చూస్తుంది నా పైట చెంగు లాగీ కవ్వించకు సెలయేరు నవ్వుతుంది చిరుగాలి చూస్తుంది నా పైట చెంగు లాగీ కవ్వించకు అనువైన వేళ అందాలు దాచకూ అనువైన వేళ అందాలు దాచకూ అణువణువు నిన్నే కోరే మురిపించకూ ఇకనైన నునుసిగ్గు తెరవేయకూ నీ చూపుతో నన్ను ముడివేయకూ ఈ పూలు వింతాయె తడిచేయకూ కన్నుల్లో మిసమిసలు కనిపించనీ ఎటు చూసినా నువ్వే వినిపించె నీ నవ్వే మోహాలతో నన్ను మంత్రించకూ ఎటు చూసినా నువ్వే వినిపించె నీ నవ్వే మోహాలతో నన్ను మంత్రించకూ మనలోని ప్రేమా మారాకు వేయనీ మనలోని ప్రేమా మారాకు వేయనీ మనసారా ఒడిలో నన్ను నిదురించనీ నీ నీలి ముంగురులు సవరించనీ నీ చూపుతో నన్ను ముడివేయకూ ఈ పూలు వింతాయె తడిచేయకూ కన్నుల్లో మిసమిసలు కనిపించనీ గుండెల్లో గుసగుసలు వినిపించనీ కన్నుల్లో మిసమిసలు కనిపించనీ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి