15, జనవరి 2022, శనివారం

Ramudu Bheemudu : Undile Machi kalam Song Lyrics (ఉందిలే మంచి కాలం )

చిత్రం: రాముడు-భీముడు (1964)

రచన: శ్రీ శ్రీ

గానం: ఘంటసాల,సుశీల

సంగీతం: పెండ్యాల




ఉందిలే మంచి కాలం ముందు ముందూనా అందరూ సుఖపడాలి నందనందాన ఎందుకో.. సందేహమెందుకో..

రానున్న విందులో.. నీ వంతు అందుకో ఆ రోజు అదిగో కలదూ నీ యెదుటా.. నీవే రాజువట ఏమిటేమిటేమిటే.. మంచి కాలం అంటున్నావ్? ఎలాగుంటుందో ఇశితంగా చెప్పూ దేశ సంపద పెరిగే రోజు...

మనిషి మనిషిగా బ్రతికే రోజు.. గాంధీ మహాత్ముడు కలగన్న రోజు.. నెహ్రూ అమాత్యుడు నెలకొల్పు రోజు ఆ రోజెంతో దూరం లేదోరన్నయ్యో..ఓ..ఓ.. అదిగో చూడు రేపే నేడు చిన్నయ్యో భలే భలే..బాగా చెప్పావ్.. కాని.. అందుకు మనమేం చెయ్యాలో అది కూడా నువ్వే చెప్పు

అందరి కోసం ఒక్కడు నిలిచి.. ఒక్కనికోసం అందరూ కలిసి సహకారమే మన వైఖరియైతే.. ఉపకారమే మన ఊపిరి ఐతే.. పేదాగొప్పా భేదం పోయి అందరూ..ఊ..ఊ..

నీదినాదని వాదం మాని ఉందురూ..ఊ.. ఆ రోజెంతో దూరంలేదోరన్నయ్యో. అదిగో చూడు రేపేనేడు

చిన్నయ్యో తీయగా బ్రతుకంతా మారగా కష్టాలు తీరగా.. సుఖశాంతులూరగా ఆకాశవీధుల ఎదురేలేకుండా ఎగురును మన జెండా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి