చిత్రం: రాజకోట రహస్యం (1971)
రచన: సి.నారాయణ రెడ్డి
గానం: ఘంటసాల,పి. సుశీల
సంగీతం: విజయ కృష్ణమూర్తి, విజయ ఆనంద్
నెలవంక తొంగి చూసింది.. చలిగాలి మేను సోకింది మనసైన చెలువ కనులందు నిలువ.. తనువెల్ల పొంగి పూచింది నెలవంక తొంగి చూసింది.. చలిగాలి మేను సోకింది చిరునవ్వులొలుక చెలికాడు పలుక.. నిలువెల్ల వెల్లి విరిసింది నెలవంక తొంగి చూసింది… ఏ జన్మలోని వరమో .. ఈ జన్మలోన దొరికె ఏ జన్మలోని వరమో .. ఈ జన్మలోన దొరికె ఏ పూలనోము ఫలమో .. నీ రూపమందు నిలిచె సుడిగాలులైన ..జడివానలైన.. విడిపోని బంధమే వెలసె నెలవంక తొంగి చూసింది .. చలిగాలి మేను సోకింది ఆనాటి వలపు పాట .. ఈనాటి బ్రతుకు బాట ఆనాటి వలపు పాట .. ఈనాటి బ్రతుకు బాట ఆనాటి కలవరింత .. ఈనాటి కౌగిలింత ఏనాటికైన .. ఏ చోటనైన విడిపోనిదోయి మన జంట నెలవంక తొంగి చూసింది .. చలిగాలి మేను సోకింది చిరునవ్వులొలుక చెలికాడు పలుక .. నిలువెల్ల వెల్లి విరిసింది నెలవంక తొంగి చూసింది .. చలిగాలి మేను సోకింది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి