చిత్రం: శ్రీ రామదాసు (2006)
రచన: రామదాసు కీర్తన
గానం: శంకర్ మహదేవన్
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
ఇక్ష్వాకు కుల తిలకా ఇకపైన పలుకవే రామ చంద్రా నను రక్షింపకున్నను రక్షకుడు ఎవరింక రామ చంద్రా... చుట్టు ప్రాకారములు సొంపుతో కట్టిస్తి రామ చంద్రా ఆ ప్రాకారముకు బట్టె పదివేల వరహాలు రామచంద్రా లక్ష్మణుకు చేయిస్తి ముత్యాల పతకము రామచంద్రా ఆ పతకానికి పట్టె పదివేల మొహరీలు రామచంద్రా సీతమ్మకు చేయిస్తిని చింతాకు పతకము రామచంద్రా ఆ పతకానికి పట్టె పదివేల వరహాలు రామచంద్రా కలికితురాయి నీకు పొరుపుగా చేయిస్తిని రామచంద్రా నీ తండ్రి దశరధ మహారాజు పంపెనా లేక నీ మామ జనక మహారాజు పెట్టెనా ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్రా ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్రా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి