Sri Ramadasu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Sri Ramadasu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

7, జనవరి 2022, శుక్రవారం

Sri Ramadasu : Nanu Brovamani Song Lyrics (ననుబ్రోవమని)

చిత్రం: శ్రీ రామదాసు (2006)

రచన: రామదాసు కీర్తన

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సునీత

సంగీతం: ఎం. ఎం. కీరవాణి


పల్లవి: ననుబ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి

ననుబ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి

ననుబ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి

చరణము(లు):

ననుబ్రోవమని చెప్పవే నారీశిరోమణి జనకుని కూతుర జనని జానకమ్మ న

ననుబ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి

ప్రక్కను చేరుక చెక్కిలి నొక్కుచు చక్కగ మరుకేళి సొక్కుచుండెడి వేళ

ననుబ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి


ప్రక్కను చేరి చెక్కిలి నొక్కుచు

చక్కగా మరుకేలి చొక్కియుండెడి వేల నను బ్రోవమని చెప్పవే న

ననుబ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి


ఏకాంతరంగుడు శ్రీకాంత నినుగూడి

ఏకాంతమున నేకశయ్యనున్న వేళ న

ననుబ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి


అద్రిజవినుతుడు భద్రగిరీశుడు

నిద్రమేల్కొనువేళ నెలతరో బోధించి న

ననుబ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి


Sri Ramadasu : Ikshvaku Kula Song Lyrics (ఇక్ష్వాకు కుల)

చిత్రం: శ్రీ రామదాసు (2006)

రచన: రామదాసు కీర్తన

గానం: శంకర్ మహదేవన్

సంగీతం: ఎం. ఎం. కీరవాణి



ఇక్ష్వాకు కుల తిలకా ఇకపైన పలుకవే రామ చంద్రా నను రక్షింపకున్నను రక్షకుడు ఎవరింక రామ చంద్రా... చుట్టు ప్రాకారములు సొంపుతో కట్టిస్తి రామ చంద్రా ఆ ప్రాకారముకు బట్టె పదివేల వరహాలు రామచంద్రా లక్ష్మణుకు చేయిస్తి ముత్యాల పతకము రామచంద్రా ఆ పతకానికి పట్టె పదివేల మొహరీలు రామచంద్రా సీతమ్మకు చేయిస్తిని చింతాకు పతకము రామచంద్రా ఆ పతకానికి పట్టె పదివేల వరహాలు రామచంద్రా కలికితురాయి నీకు పొరుపుగా చేయిస్తిని రామచంద్రా నీ తండ్రి దశరధ మహారాజు పంపెనా లేక నీ మామ జనక మహారాజు పెట్టెనా ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్రా ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్రా

8, ఆగస్టు 2021, ఆదివారం

Sri Ramadasu : Paluke Bangaramayera Song Lyrics (పలుకే బంగారమాయెనా)

చిత్రం : శ్రీ రామదాసు (2006)

సంగీతం: ఎం. ఎం. కీరవాణి

సాహిత్యం: రామదాసు కీర్తన

గానం: ఎం. ఎం. కీరవాణి , కె.యస్.చిత్ర


కలలో నీ నామ స్మరణ మరువ చక్కని తండ్రి కలలో నీ నామ స్మరణ మరువ చక్కని తండ్రి పిలిచిన పలుకవేమి పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయె పిలిచిన పలుకవేమి కలలో నీ నామ స్మరణ మరువ చక్కని తండ్రి పలుకే.. పలుకే బంగారమాయెనా కోదండపాణి పలుకే బంగారమాయెనా రామా... ఇరవుగ ఇసుకలోన పొరలిన ఉడుత భక్తికి ఇరవుగ ఇసుకలోన పొరలిన ఉడుత భక్తికి కరుణించి బ్రోచితివని నెర నమ్మితిని తండ్రి

పలుకే బంగారమాయెనా.. పలుకే బంగారమాయెనా.. పలుకే బంగారమాయెనా..

శరణాగతత్రాణ బిరుదాంకితుడవు కావా శరణాగతత్రాణ బిరుదాంకితుడవు కావా కరుణించు బధ్రాచల వన రామదాస పోషా పలుకే బంగారమాయెనా...

Sri Ramadasu : Chalu Chalu Song Lyrics (చాలు చాలు చాలు)

చిత్రం : శ్రీ రామదాసు (2006)

సంగీతం: ఎం. ఎం. కీరవాణి

సాహిత్యం: చంద్రబోస్

గానం: ఎస్పీ చరణ్, సునీత



పల్లవి:     ససలు గగలు.. గగలు నినిలు.. ససలు నినిలు.. దదలు నినిలు.. గమదని సగ సగ సగ మగ సని దని దని సగ సని దమ గమ గములు...     చాలు చాలు చాలు... చాలు చాలు చాలు విరహాలు చాలు చాలు చాలు     చాలు చాలు చాలు చాలు... విరహాలు చాలు చాలు...     ముద్దుగ ముద్దుగ వినవలెగా .. నా ముద్దువిన్నపాలు .. పాలూ     వన్నెపూలలో విన్నపాలు .. నువ్వు ఆరగిస్తే మేలు     చాలు చాలు చాలు... చాలు చాలు చాలు విరహాలు చాలు చాలు చరణం 1:     నీ కరములు నా మేనికీ వశీకరములు...     నీ స్వరములు ఈ రేయికి అవసరములు...     నీ... కరములు నా మేనికీ... వశీకరములు...     నీ... స్వరములు ఈ రేయికి.. అవసరములు...     నీ క్షణములు మన జంటకి విలక్షనములు...     ఈ సుఖములు మునుపెరుగని బహుముఖములు...     రామా ఇంటికి.. మన్మధుడా అను పిలుపులు ... ఆ లీలలు ఆవలీలలు... చాలు చాలు... చాలు చాలు చాలు... విరహాలు చాలు చాలు చాలు ... చరణం 2:     ఈ చిలకలు సరసనికి మధుర గులుకలు..     హూ.. ఈ పడకలు మోక్షానికి ముందు గడపలు...     ఈ.... చిలకలు సరససానికీ... మధుర గులుకలు..     ఈ... పడకలు మోక్షానికి.. ముందు గడపలు..     ఈ... తనువులు సమరానికి ప్రాణధనువులు..     ఈ... రణములు రససిద్దికి కారణములు...     విరామా.....లెననడు ఎరుగనివి     చలి ఈడులు... తొలిదాడులు... ఛీ పాడులు... చాలు...     ఛీ.. చాలు... చాలు చాలు చాలు...     విరహాలు చాలు చాలు చాలు ...     చాలు చాలు చాలు చాలు...     విరహాలు చాలు చాలు...

Sri Ramadasu : Antha Ramamayam Song Lyrics (అంతా రామమయం)

చిత్రం : శ్రీ రామదాసు (2006)

సంగీతం: ఎం. ఎం. కీరవాణి

సాహిత్యం: రామదాసు కీర్తన

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం



అంతా రామమయం! ఈ జగమంతా రామమయం!! రామ రామ రామ రామ రామ రామ రామ అంతా రామమయం .ఈ జగమంతా రామమయం! అంతా రామమయం .ఈ జగమంతా రామమయం!! అంతా రామమయం!!! అంతరంగమున ఆత్మారాముడు. రామ రామ రామ రామ రామ రామ రామ అనంత రూపముల వింతలు సలుపగ రామ రామ రామ రామ రామ రామ రామ సోమసూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు అవనీజంబులు అంతా రామమయం .ఈ జగమంతా రామమయం! అంతా రామమయం!! ఓం నమో నారాయణాయ! ఓం నమో నారాయణాయ!! ఓం నమో నారాయణాయ!!! అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగ నదులు వనంబులు నానామృగములు పీత కర్మములు వేద శాస్త్రములు అంతా రామమయం .ఈ జగమంతా రామమయం! రామ రామ రామ రామ రామ రామ రామ! సిరికిన్ జెప్పడు.శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడు ఏ పరివారంబును జీరడు.అభ్రకపతిన్ బంధింపడు ఆకర్ణికాంతర ధన్ విల్లము చక్క నొక్కడూ. నివాదప్రోద్ధీత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడూ. గజప్రాణావనోత్సాహియై!

Sri Ramadasu : Dasarathi Song Lyrics (దాశరధి కరుణా పయోనిధీ )

చిత్రం : శ్రీ రామదాసు (2006)

సంగీతం: ఎం. ఎం. కీరవాణి

సాహిత్యం: వేదవ్యాస్

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర



దాశరధి కరుణా పయోనిధీ నువ్వే దిక్కని నమ్మడమా.... నీ ఆలయమును నిర్మించడమా...... నిరతము నిను భజియించడమా ...... రామ కోటి రచిఇంచడమా...... సీతా రామస్వామి,నే చేసిన నేరమదేమి.... ని దయ చూపవదేమి, ని దర్శన మీయవదేమి.... దాశరధి కరుణాపయోనిధీ..... గుహుడు నీకు చుట్టమా, గుండెలకు హత్తుకున్నావు. శబరి నీకు తోబుట్టువా, ఎంగిలి పళ్ళను తిన్నావు. ని రాజ్యము రాసిమ్మంటిన, నీ దర్శనమే ఇమ్మంటిని కానీ... ఏల రావు, నన్నెలరావు, నన్నేల ఎలా రావూ... సీతా రామ స్వామీ.... సీతా రామస్వామి నే చేసిన నేరమదేమి ని దయ చూపవదేమి ని దర్శన మీయవదేమి.... రామ రసరమ్య ధామ, రమణీయ నామ, రఘువంశ సోమా, రణరంగ భీమా, రాక్షస విరామ, కమనీయ ధామ, సౌందర్య సీమ, నీరాజశ్యామ నిజ భుజోద్దామా భోజనల లామ, భువన జయ రామ, పాహి భద్రాద్రి రామ పాహీ... తక్షణ రక్షణ విశ్వవిలక్షణ ధర్మ విచక్షణ గోదారికలిసేనేమి రా, డాన్ డ డ, డాన్ డ డ, డాన్ డ నినాదముల జాండమునిండ మత్త వేదండము నిక్కీనే పొగడు ని అభయవ్రతమేథిరా ప్రేమ రసాంతరంగా హృదయాంగమా శృంగ శుభంగా రంగ బహురంగదా భంగ తుంగ సుగుణైక తరంగ సుసంగా సత్య సారంగా సుశ్రుతివిహంగా పాప మృదు సాంగ విభంగా భూతల పతంగా..... మధు మంగళ రూపము చూపవేమి రా గరుడగమనా రా రా .. గరుడగమనా రా రా ....

Sri Ramadasu : Suddha Brahma Song Lyrics (శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ)

చిత్రం : శ్రీ రామదాసు (2006)

సంగీతం: ఎం. ఎం. కీరవాణి

సాహిత్యం: సంప్రదాయకమైన పాట

గానం:  ప్రణవి



శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ… కాలాత్మక పరమేశ్వర రామ… || 2 || శేషతల్ప సుఖనిద్రిత రామ… బ్రహ్మద్యమర ప్రార్ధిత రామ… || 2 || రామ రామ జయ రాజా రామ… రామ రామ జయ సీతా రామ… రామ రామ జయ రాజా రామ… రామ రామ జయ సీతా రామ… ప్రియగుహ వినివేధితపద రామ… శబరీ దత్త ఫలాశన రామ… ప్రియగుహ వినివేధితపద రామ… శబరీ దత్త ఫలాశన రామ… హనుమత్సేవిత నిజపద రామ… సీతా ప్రాణాదారక రామ… హనుమత్సేవిత నిజపద రామ… సీతా ప్రాణాదారక రామ… రామ రామ జయ రాజా రామ… రామ రామ జయ సీతా రామ… శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ… కాలాత్మక పరమేశ్వర రామ

Sri Ramadasu : Adigoadigo Badragiri Song Lyrics (అదిగో అదిగో భద్రగిరి)

చిత్రం : శ్రీ రామదాసు (2006)

సంగీతం: ఎం. ఎం. కీరవాణి

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం


ఓం ఓం ఓం  శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమః అదిగో అదిగో భద్రగిరి ఆంధ్రజాతికిది అయోధ్యాపురి ఏ వాల్మీకీ రాయని కథగా సీతారాములు తనపై ఒదగా రామదాసకృత రామపదామృత వాగ్గేయస్వర సంపదగా వెలసిన దక్షిణ సాకేతపురి అదిగో అదిగో భద్రగిరి ఆంధ్రజాతికిది అయోధ్యాపురి రాం రాం రాం రాం రామనామ జీవన నిర్నిద్రుడు పునఃదర్శనము కోరిన భద్రుడు సీతారాముల దర్శనానికై ఘోరతపస్సును చేసెనప్పుడు తపమును మెచ్చి ధరణికి వచ్చి దర్శనమిచ్చెను మహావిష్ణువు త్రేతాయుగమున రామరూపమే త్రికరణశుద్దిగ కోరెను భద్రుడు ఆదర్శాలకు అగ్రపీఠమౌ ఆ దర్శనమే కోరెనప్పుడు ధరణీ పతియే ధరకు అల్లుడై శంఖచక్రములు అటు ఇటు కాగా ధనుర్బాణములు తనువై పోగా సీతాలక్ష్మణ సహితుడై కొలువు తీరె కొండంత దేవుడు శిలగా మళ్ళీ మలచి శిరమును నీవే నిలచి భద్రగిరిగ నను పిలిచే భాగ్యము నిమ్మని కోరె భద్రుడు వామాంకస్థిత జానకీ పరిలస కోదండ దండం కరే చక్రం చోర్భకరేణ బాహు యుగళే శంఖం శరం దక్షిణే విఘ్రాణం జలజాత పత్ర నయనం భద్రాద్రి మూర్తిస్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రి యుక్తం భజే అదిగో అదిగో భద్రగిరి ఆంధ్రజాతికిది అయోధ్యాపురి