చిత్రం: సూత్రధారులు (1989)
సంగీతం: కె. వి. మహదేవన్
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,యస్.పి. శైలజ
పల్లవి: అయ్యా... రావయ్యా... కొలిచినందుకు నిన్ను కోదండరామా కొలిచినందుకు నిన్ను కోదండరామా కోటిదివ్వెల పాటి కొడుకువైనావా తలచినందుకు నిన్ను దశరథ రామా వెండికొండలసాటి తండ్రివైనావా జయ రామా.. జగదభి రామా పరంధామా.. పావన నామా జయ రామా.. జగదభి రామా పరంధామా.. పావన నామా చరణం: 1 బుడిబుడి నడకల బుడతడవై.. ఒడిలో ఒదిగిన ఓ రయ్యా బుడిబుడి నడకల బుడతడవై.. ఒడిలో ఒదిగిన ఓ రయ్యా కలల పంటగా... బతుకు పండగా కలల పంటగా... బతుకు పండగా కల్యాణ రాముడిలా కదలి వచ్చావా జయ రామా.. జగదభి రామా పరంధామా.. పావన నామా జయ రామా.. జగదభి రామా పరంధామా.. పావన నామా చరణం: 2 నడిచే నడవడి ఒరవడిగా... నలుగురు పొగడగా ఓరయ్యా నడిచే నడవడి ఒరవడిగా... నలుగురు పొగడగా ఓరయ్యా నీతికి పేరుగా... ఖ్యాతికి మారుగా నీతికి పేరుగా... ఖ్యాతికి మారుగా సాకేతరాముడిలా సాగిపోవయ్యా జయ రామా.. జగదభి రామా పరంధామా.. పావన నామా జయ రామా.. జగదభి రామా పరంధామా.. పావన నామా చరణం: 3 ఎంతటి వాడోయ్... రామ చంద్రుడు ఎంతటి వాడోయ్... రామ చంద్రుడు ఆ తాటకిని చెండాడినాడోయ్... యాగమును కాపాడినా డెంతటి వాడోయ్ రామ చంద్రుడు ఓహో డెంతటి వాడోయ్ రామ చంద్రుడు హొయ్ మిధిలకు వచ్చీ... రామయ్య రాముడు శివునిల్లు విరిచీ.. రామయ్య రాముడు ఓహో సీతను చేపట్టి.. రామయ్య రాముడు హొయ్ హొయ్ సీతను చేపట్టి.. రామయ్య రాముడు సీతారాముడు అయ్యేదెపుడు జయ రామా.. జగదభి రామా పరంధామా.. పావన నామా జయ రామా.. జగదభి రామా పరంధామా.. పావన నామా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి