2, ఫిబ్రవరి 2022, బుధవారం

Adavi Ramudu : Amma Thodu Song Lyrics (అమ్మతోడు...అబ్బతోడు)

చిత్రం: అడవి రాముడు (1977)

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల

సంగీతం: కె. వి. మహదేవన్



పల్లవి: అమ్మతోడు...అబ్బతోడు..నా తోడు...నీ తోడు అన్నిటికి నువ్వే నా తోడు...ఇంకెన్నటికి నేనే నీ తోడు అమ్మతోడు...అబ్బతోడు..నా తోడు...నీ తోడు అన్నిటికి నువ్వే నా తోడు...ఇంకెన్నటికి నేనే నీ తోడు చరణం 1: ఆకలన్నదే లేదు.. హర హరా..రామ రామా అన్నమే రుచికాదు ...శివ శివా..కృష్ణ కృష్ణా.. ఆకలన్నదే లేదు.. హర హరా... అన్నమే రుచికాదు... శివ శివా... వెన్నెలలొస్తె వేడిరా నా దొరా...ఆ వేడిలోనే చలేసింది రా ఆకలన్నదే నీకు లేకపోతే...ఈ కేకలెందుకే రాకపోకలెందుకే ఒట్టిమాటలింక నీవు కట్టిపెట్టు...నీ ఒట్టు తీసి గట్టుమీద అట్టిపెట్టు అమ్మతోడు...అబ్బతోడు..నా తోడు...నీ తోడు అన్నిటికి నువ్వే నా తోడు...ఇంకెన్నటికి నేనే నీ తోడు చరణం 2: కళ్ళు కాయలు కాచే హర హరా.... ఈశ్వరా నిన్ను చూడకమాకు శివ శివా.... శ్రీహర కళ్ళు కాయలు కాచే ...హర హరా నిన్ను చూడకమాకు ...శివ శివా పొద్దె గడవదు మాకు ఓ దొరా...నిద్దరన్నదే లేదు రా నిద్దరన్నదే నీకు లేకపోతే...ఈ పిలుపులెందుకే ..ఆ కులుకులెందుకే గుట్టు బయట పెట్టకుంటే ...పెద్ద ఒట్టు గట్టు మీద చిలక వింటే గుట్టు రట్టు... అమ్మతోడు...అబ్బతోడు..నా తోడు...నీ తోడు అన్నిటికి నువ్వే నా తోడు...ఇంకెన్నటికి నేనే నీ తోడు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి