2, ఫిబ్రవరి 2022, బుధవారం

Adavi Ramudu : Kokilamma Pelliki Song Lyrics (కోకిలమ్మ పెళ్ళికి కోనంతా పందిరీ)

చిత్రం: అడవి రాముడు (1977)

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల

సంగీతం: కె. వి. మహదేవన్



కుకు కుకు కుకు కుకు కోకిలమ్మ పెళ్ళికి కోనంతా పందిరీ చిగురాకులు తోరణాలు చిరుగాలి సన్నాయి డుడుం డుడుం డుడుం డుడుం వసంతుడే పెళ్ళికొడుకు వనమంతా సందడీ పూలన్నీ తలంబ్రాలు పున్నమీ తొలిరేయి తుళ్ళి తుళ్ళి నిన్న మొన్న తూనిగల్లే ఎగిరిన పిల్లదాని కొచ్చిందీ కళా పెళ్ళి కళా తలపులన్నీ వలపులైన చూపులు విరి తోపులైన పెళ్ళికొడుకు నవ్వితే కళా తళ తళా పూలగాలితో రేగిన పుప్పొడి పారాణిగా చిలక పాట నెమలి ఆట కలిసి మేజువాణిగా పూలగాలితో రేగిన పుప్పొడి పారాణిగా చిలక పాట నెమలి ఆట కలిసి మేజువాణిగా అందమైన పెళ్ళికి అందరు పేరంటాలే అడవిలోని వాగులన్నీ ఆనందపు కెరటాలే కుకు కుకు కుకు కుకు కోకిలమ్మ పెళ్ళికి కోనంతా పందిరీ చిగురాకులు తోరణాలు చిరుగాలి సన్నాయి కన్ను కన్ను కలుపుకున్న కన్నె మనసు తెలుసుకున్న కనుల నీలి నీడలే కథా ప్రేమ కథా బుగ్గలలో నిగ్గుదీసి సిగ్గులలో చిలకరించి మొగ్గ వలపు విచ్చితే కథా పెళ్ళి కథా ఇరుమనసులకొక తనువై ఇరు తనువులకొక మనువై. మనసులోని వలపులన్నీ మల్లెల విరి పానుపులై. ఇరుమనసులకొక తనువై ఇరు తనువులకొక మనువై. మనసులోని వలపులన్నీ మల్లెల విరి పానుపులై. కలిసి వున్న నూరేళ్ళు కలలుగన్న వెయ్యేళ్ళు మూడు ముళ్ళు పడిన నాడు ఎదలు పూల పొదరిళ్ళు కుకు కుకు కుకు కుకు కోకిలమ్మ పెళ్ళికి కోనంతా పందిరీ చిగురాకులు తోరణాలు చిరుగాలి సన్నాయి డుడుం డుడుం డుడుం డుడుం వసంతుడే పెళ్ళికొడుకు వనమంతా సందడీ పూలన్నీ తలంబ్రాలు పున్నమీ తొలిరేయి!! కుకు కుకు కుకు కుకు డుడుం డుడుం డుడుం డుడుం కుకు కుకు కుకు కుకు డుడుం డుడుం డుడుం డుడుం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి