చిత్రం : డాన్స్ మాస్టర్ (1986)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
పల్లవి :
రేగుతున్నదొక రాగం ఎదలో సొదలా
రేపుతున్నదొక మొహం నదిలో అలలా
కనులే ముద్దులాడగా... కలలే కన్ను గీటగా... కసిగా
రేగుతున్నదొక రాగం ఎదలో సొదలా
రేపుతున్నదొక మొహం నదిలో అలలా
చరణం 1 :
చెక్కిళ్ళలో ముద్దు చెమ్మ తడి ఆరకున్నది
నీ కళ్ళలో నీటి బొమ్మ కదలాడిందే
తెలిపింది కన్నె గళమే మనువాడలేదని
ఓ పువ్వు పూసింది ఒడిలో తొలి ప్రేమల్లే
మెలకువే స్వప్నమై మెలి తిరిగెను నాలో
ఒరిగినా ఒదిగినా హత్తుకొనే ప్రేమ
ఈ పిలుపే పిలిచే వలపై పెదవుల్లో దాగి
రేగుతున్నదొక రాగం ఎదలో సొదలా
రేపుతున్నదొక మొహం నదిలో అలలా
కనులే ముద్దులాడగా... కలలే కన్ను గీటగా... కసిగా
రేగుతున్నదొక రాగం ఎదలో సొదలా
రేపుతున్నదొక మొహం నదిలో అలలా
చరణం 2 :
తారాడు తలపులెన్నో నీలాల కురులలో
తనువు మరచిపోయే మరులే పొంగే
ముద్దాడసాగె పెదవి ఒక మూగ భావమే
చాటు కవితలన్నీ అనురాగాలే
పెదవులే విచ్చిన మల్లె పూల వాసన
సొగసులే సోకినా వయసుకే దీవెన
వీరెవరో జత కోకిలలో ఎదలేడై లేచి
రేగుతున్నదొక రాగం ఎదలో సొదలా
రేపుతున్నదొక మొహం నదిలో అలలా
కనులే ముద్దులాడగా... కలలే కన్ను గీటగా... కసిగా
రేగుతున్నదొక రాగం ఎదలో సొదలా
రేపుతున్నదొక మొహం నదిలో అలలా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి