2, ఫిబ్రవరి 2022, బుధవారం

Doctor Chakravarthi : Ee Mounam Ee Bidiyam Song Lyrics (ఈ మౌనం... ఈ బిడియం...)

చిత్రం: డాక్టర్ చక్రవర్తి (1964)

సాహిత్యం: ఆరుద్ర

గానం: ఘంటసాల, ,పి. సుశీల

సంగీతం: సాలూరి.రాజేశ్వర రావు



ఈ మౌనం... ఈ బిడియం... ఇదేనా ఇదేనా చెలియ కానుక ఈ మౌనం... ఈ బిడియం... ఇదేలే ఇదేలే మగువ కానుక... ఈ మౌనం... ఇన్నినాళ్ళ మన వలపులు వికసించుట ఇందుకా ఇన్నినాళ్ళ మన వలపులు వికసించుట ఇందుకా మమతలన్ని తమకు తామె ... మమతలన్ని తమకు తామె అల్లుకొనెడి మాలిక... ఆ... ఆ...ఆ... ఈ మౌనం... ఈ బిడియం... ఇదేనా ఇదేనా చెలియ కానుక ఈ మౌనం... ఈ బిడియం... ఇదేలే ఇదేలే మగువ కానుక... ఈ మౌనం మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక అహ... ఓహొ... ఆ.... మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక కనులు కలిసి అనువదించు ప్రణయ భావగీతిక... ఆ...ఆ... ఆ... ఈ మౌనం... ఈ బిడియం... ఇదేనా ఇదేనా చెలియ కానుక ఈ మౌనం... ఈ బిడియం... ఏకాంతము దొరికినంత ఎడమోమా నీవేడుక ఏకాంతము దొరికినంత ఎడమోమా నీవేడుక ఎంత ఎంత ఎడమైతే... ఎంత ఎంత ఎడమైతే అంత తీపి కలయిక... ఆ...ఆ... ఆ... ఈ మౌనం... ఈ బిడియం... ఇదేనా ఇదేనా చెలియ కానుక ఈ మౌనం... ఈ బిడియం... ఇదేలే ఇదేలే మగువ కానుక... ఈ మౌనం


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి