చిత్రం: ఘర్షణ (1988)
సాహిత్యం: రాజశ్రీ
సంగీతం: ఇళయరాజా
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరామ్
పల్లవి :
కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను ఇరు చూపులే అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను శృంగారమునకీవే శ్రీకారమే కావే కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను ఇరు చూపులే చరణం : 1
ఆకులపై రాలు... ఆ... ఆ... ఆ..... ఆకులపై రాలు హిమబిందువువోలె నా చెలి ఒడిలోన పవళించనా ఆకులపై రాలు హిమబిందువువోలె నా చెలి ఒడిలోన పవళించినా రాతిరి పగలు మురిపాలు పండించు చెలికాణ్ణి ఎద చేర్చి లాలించనా నేను నీకు రాగ తాళం... నీవు నాకు వేద నాదం... ఆ... ఆ... ఆ... కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను ఇరు చూపులే అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను శృంగారమునకీవే శ్రీకారమే కావే కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను ఇరు చూపులే చరణం : 2
కన్నుల కదలాడు ఆశలు శ్రుతి పాడు వన్నెల మురిపాల కథ ఏమిటో తలపుల మాటుల్లో వలపుల తోటల్లో ఊహలు పలికించు కలలేవిఁటో పెదవుల తెరలోన మధురాల సిరివాన మధురిమలందించు సుధలేమిటో పరవశమే సాగి పరువాలు చెలరేగి మనసులు కరిగించు సుఖమేమిటో పల్లవించే మోహ బంధం ఆలపించే రాగ బంధం... ఆ... ఆ... ఆ... కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను ఇరు చూపులే అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను శృంగారమునకీవే శ్రీకారమే కావే కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను ఇరు చూపులే
Thank you sir
రిప్లయితొలగించండి