Gharshana (1988) లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Gharshana (1988) లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

9, ఫిబ్రవరి 2022, బుధవారం

Gharshana : Oka Brindavanam Song Lyrics (ఒక బృందావనం సోయగం )

చిత్రం: ఘర్షణ (1988)

సాహిత్యం: రాజశ్రీ

సంగీతం: ఇళయరాజా

గానం: వాణి జయరామ్



ఒక బృందావనం సోయగం ఎద కోలాహలం క్షణక్షణం ఒకే స్వరం సాగేను తీయగ ఒకే సుఖం విరిసేను హాయిగ ఒక బృందావనం సోయగం నే సందెవేళ జాబిలి నా గీతమాల ఆమని నా పలుకు తేనె కవితలే నా కులుకు చిలక పలుకులే నే కన్న కలల నీడ నందనం నాలోని వయసు ముగ్ధ మోహనం ఒకే స్వరం సాగేను తీయగ ఒకే సుఖం విరిసేను హాయిగ ఒక బృందావనం సోయగం నే మనసు పడిన వెంటనే ఓ ఇంధ్రధనుసు పొంగునే ఈ వెండి మేఘమాలనే నా పట్టు పరుపు చేయనే నే సాగు బాట జాజి పూవులే నాకింక సాటి పోటి లేదులే ఒకే స్వరం సాగేను తీయగ ఒకే సుఖం విరిసేను హాయిగ ఒక బృందావనం సోయగం ఒకే స్వరం సాగేను తీయగ ఒకే సుఖం విరిసేను హాయిగ ఒక బృందావనం సోయగం

Gharshana : Neeve Amaraswarame Song Lyrics (నీవే అమరస్వరమే )

చిత్రం: ఘర్షణ (1988)

సాహిత్యం: రాజశ్రీ

సంగీతం: ఇళయరాజా

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర




నీవే అమరస్వరమే సాగే శృతిని నేనే నీ మనసూ నీ మమతా వెలిసేనే నా కోసం నీలో సర్వం నా సొంతం నీవే అమరస్వరమే సాగే శృతిని నేనే పలికే నీ అధరాలు చిలికేనే మధురాలు నింగి వీడి నేల జారిన జాబిలి మురిసే నీలో అందం కురిసే ఊహల గంధం మల్లె పూల బంధమీవు ఓ’చెలి అంతులేనిది ఈ కథ అందరాని సంపద రాగ బంధనం అనురాగ చందనం అంతులేనిది ఈ కథ అందరాని సంపద రాగ బంధనం అనురాగ చందనం నా ధ్యాసలు నీవే నీ బాసలు నేనే నా ఊహలు నీవే నీ ఊపిరి నేనే నీలో సర్వం నా సొంతం నీవే అమరస్వరమే సాగే శృతిని నేనే మెరిసే మల్లెల లోకం చిందే చల్లని గానం తీయనైన ఆశలన్ని నీ వరం తరగని చెరగని కావ్యం ఊహలకిది అనుబంధం భావ రాగ భాష్యమే ఈ జీవితం పలకరించు చూపులు పాట పాడు నవ్వులు కొత్త పల్లవి కొసరీ ఆలపించెనె పలకరించు చూపులు పాట పాడు నవ్వులు కొత్త పల్లవి కొసరీ ఆలపించెనె నూరేళ్ళు నీతో సాగాలి నేనే నీ గుండెల్లోన నిండాలి నేనే నీలో సర్వం నా సొంతం నీవే అమరస్వరమే సాగే శృతిని నేనే నీ మనసూ నీ మమతా వెలిసేనే నా కోసం నీలో సర్వం నా సొంతం నీవే అమరస్వరమే సాగే శృతిని నేనే

Gharshana : Kurisenu Virijallule Song Lyrics (కురిసేను విరిజల్లులే)

చిత్రం: ఘర్షణ (1988)

సాహిత్యం: రాజశ్రీ

సంగీతం: ఇళయరాజా

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరామ్




పల్లవి :

కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను ఇరు చూపులే అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను శృంగారమునకీవే శ్రీకారమే కావే కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను ఇరు చూపులే చరణం : 1

ఆకులపై రాలు... ఆ... ఆ... ఆ..... ఆకులపై రాలు హిమబిందువువోలె నా చెలి ఒడిలోన పవళించనా ఆకులపై రాలు హిమబిందువువోలె నా చెలి ఒడిలోన పవళించినా రాతిరి పగలు మురిపాలు పండించు చెలికాణ్ణి ఎద చేర్చి లాలించనా నేను నీకు రాగ తాళం... నీవు నాకు వేద నాదం... ఆ... ఆ... ఆ... కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను ఇరు చూపులే అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను శృంగారమునకీవే శ్రీకారమే కావే కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను ఇరు చూపులే చరణం : 2

కన్నుల కదలాడు ఆశలు శ్రుతి పాడు వన్నెల మురిపాల కథ ఏమిటో తలపుల మాటుల్లో వలపుల తోటల్లో ఊహలు పలికించు కలలేవిఁటో పెదవుల తెరలోన మధురాల సిరివాన మధురిమలందించు సుధలేమిటో పరవశమే సాగి పరువాలు చెలరేగి మనసులు కరిగించు సుఖమేమిటో పల్లవించే మోహ బంధం ఆలపించే రాగ బంధం... ఆ... ఆ... ఆ... కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను ఇరు చూపులే అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను శృంగారమునకీవే శ్రీకారమే కావే కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను ఇరు చూపులే

Gharshana : Rojalo letha vannele Song Lyrics (రోజాలే లేత వన్నెలే)

చిత్రం: ఘర్షణ (1988)

సాహిత్యం: రాజశ్రీ

సంగీతం: ఇళయరాజా

గానం: వాణి జయరామ్



రోజాలే లేత వన్నెలే రాజాకే తేనే విందులే ఊసులాడు నా కళ్ళూ నీకు నేడు సంకెళ్ళూ పాల పొంగు చెక్కిళ్ళు వేసే పూల పందిళ్ళూ లవ్ లవ్ ఈ కధా ఓ ఓ మన్మథా మైకం సాగనీ దాహం తీరనీ రోజాలే లేత వన్నెలే రాజాకే తేనే విందులే మొన్న చిగురేసెనే నిన్న మొగ్గాయనే నేడు పువ్వాయెనే ఓడుకల్లాడినే సందేల వయసెందుకో చిందులేస్తున్నవీ అందాల సొగసే నినూ అందుకోమన్నదీ క్షణం క్షణం ఇలాగే వరాలు కోరుతున్నదీ చిన్..నదీ రోజాలే లేత వన్నెలే రాజాకే తేనే విందులే ముద్దు మురిపాలలో సద్దులే చేసుకో వేడి పరువాలలో పండగే చేసుకో నా చూపులో ఉన్నవీ కొత్త కవ్వింతలూ నా నవ్వులో ఉన్నవీ కోటి కేరింతలూ ఇవే ఇవే ఈ వేళా సుఖాల పూల వేడుకా వే..డుకా రోజాలే లేత వన్నెలే రాజాకే తేనే విందులే ఊసులాడు నా కళ్ళూ నీకు నేడు సంకెళ్ళూ పాల పొంగు చెక్కిళ్ళు వేసే పూల పందిళ్ళూ లవ్ లవ్ ఈ కధా ఓ ఓ మన్మథా మైకం సాగనీ దాహం తీరనీ రోజాలే లేత వన్నెలే రాజాకే తేనే విందులే

Gharshana : Raja Rajadhi Raja Song Lyrics (రాజ రాజాధి రాజాధి రాజ)

చిత్రం: ఘర్షణ (1988)

సాహిత్యం: రాజశ్రీ

సంగీతం: ఇళయరాజా

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం



రాజ రాజాధి రాజాధి రాజ పూజ చెయ్యాలి కుర్రకారు పూజ నిన్న కాదు నేడు కాదు ఎప్పుడూ నే రాజ కోట లేదు పేట లేదు అప్పుడూ నే రాజ రాజ రాజాధి రాజాధి రాజ పూజ చెయ్యాలి కుర్రకారు పూజ ఎదురు లేదు బెదురు లేదు లేదు నాకు పోటి లోకంలోన లోకుల్లోన నేనే నాకు సాటి ఆడి పాడేనులే అంతు చూసేనులే చెయ్యి కలిపేనులే చిందులేసేనులే చీకు చింత లేదు ఇరుగు పొరుగు లేదు ఉన్నది ఒకటే ఉల్లాసమే నింగి నేల నీరు నిప్పు గాలి ధూళి నాకే తోడు.......... రాజ రాజాధి రాజాధి రాజ పూజ చెయ్యాలి కుర్రకారు పూజ రైక కోక రెండు లేవు అయినా అందం ఉంది మనసు మంచి రెండు లేవు అయినా మర్మం ఉంది కళలూగించెలే కధలూరించెలే కళ్ళు వల వేసెనే ఒళ్ళు మరిచేనులే వన్నెల పొంగులు కలవి మత్తుగ చూపులు రువ్వి రచ్చకు ఎక్కే రాచిలకలే నింగి నేల నీరు నిప్పు గాలి ధూళి నాకే తోడు...... రాజ రాజాధి రాజాధి రాజ పూజ చెయ్యాలి కుర్రకారు పూజ రాజ రాజాధి రాజాధి రాజ పూజ చెయ్యాలి కుర్రకారు పూజ నిన్న కాదు నేడు కాదు ఎప్పుడూ నే రాజ కోట లేదు పేట లేదు అప్పుడూ నే రాజ రాజ రాజాధి రాజాధి రాజ పూజ చెయ్యాలి కుర్రకారు పూజ