చిత్రం: ఘర్షణ (1988)
సాహిత్యం: రాజశ్రీ
సంగీతం: ఇళయరాజా
గానం: వాణి జయరామ్
ఒక బృందావనం సోయగం ఎద కోలాహలం క్షణక్షణం ఒకే స్వరం సాగేను తీయగ ఒకే సుఖం విరిసేను హాయిగ ఒక బృందావనం సోయగం నే సందెవేళ జాబిలి నా గీతమాల ఆమని నా పలుకు తేనె కవితలే నా కులుకు చిలక పలుకులే నే కన్న కలల నీడ నందనం నాలోని వయసు ముగ్ధ మోహనం ఒకే స్వరం సాగేను తీయగ ఒకే సుఖం విరిసేను హాయిగ ఒక బృందావనం సోయగం నే మనసు పడిన వెంటనే ఓ ఇంధ్రధనుసు పొంగునే ఈ వెండి మేఘమాలనే నా పట్టు పరుపు చేయనే నే సాగు బాట జాజి పూవులే నాకింక సాటి పోటి లేదులే ఒకే స్వరం సాగేను తీయగ ఒకే సుఖం విరిసేను హాయిగ ఒక బృందావనం సోయగం ఒకే స్వరం సాగేను తీయగ ఒకే సుఖం విరిసేను హాయిగ ఒక బృందావనం సోయగం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి