చిత్రం: గృహప్రవేశం (1982)
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి
సంగీతం: సత్యం
అభినవ శశిరేఖవో .... ప్రియతమ శుభలేఖవో.... అభినవ శశిరేఖవో.... ప్రియతమ శుభలేఖవో.... ఆ తొలి చూపు కిరణాల నెలవంక నీవో.... నవయువ కవిరాజువో....ప్రియతమ నెలరాజువో.... నా కనుదూయి కమలాల భ్రమరంబు నీవో నవయువ కవిరాజువో....ప్రియతమ నెలరాజువో....
ఆ కనులు ఇంద్ర నీలాలుగా....ఈ తనువు చంద్ర శిఖరాలుగా.... కదలాడు కల్యాణివే.... నా హృదయం మధుర సంగీతమై....కళ్యాణవీణ స్వరగీతమై శృతి చేయు జతగాడివి.... ఆ కథలోన వ్యధలన్నీ చల్లార్చవే.... నవయువ కవిరాజువో....అభినవ శశిరేఖవో....
నా వయసు వలపు హరివిల్లుగా....నవ పారిజాతాల పొదరిల్లుగా.... రావోయి రవి శేఖరా.... తొలి సంధ్య మధుర మందారమే నీ నుదుటి తిలక సింగారమై నూరేళ్ళు వెలిగించనా.... నా నూరేళ్ళ నెలవల్లు కరిగించనా.... అభినవ శశిరేఖవో....ప్రియతమ శుభలేఖవో....ఆ తొలి చూపు కిరణాల నెలవంక నీవో.... నవయువ కవిరాజువో....ప్రియతమ నెల రాజువో....నా కనుదూయి కమలాల భ్రమరంభు నీవో.... అభినవ శశిరేఖవో ....ప్రియతమ నెలరాజువో....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి