చిత్రం: గుండమ్మ కథ (1962)
రచన: పింగళి
గానం: ఘంటసాల,పి. సుశీల
సంగీతం: ఘంటసాల
పల్లవి:
మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే తెలుపక తెలిపే అనురాగము నీ కనులనే కనుగొంటిలే నీ మనసు నాదనుకొంటిలే
మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే
చరణం 1:
కదిలీ కదలని లేత పెదవుల తేనెల వానలు కురిసెనులే.. ఆ....
కదిలీ కదలని లేత పెదవుల తేనెల వానలు కురిసెనులే
ఆనందముతో అమృతవాహిని ఓలలాడి మైమరచితిలే
మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే
చరణం 2:
ముసి ముసి నవ్వుల మోముగని నన్నేలుకొంటివని మురిసితిలే ఆ.... ముసి ముసి నవ్వుల మోముగని నన్నేలుకొంటివని మురిసితిలే రుస రుస లాడుతు విసిరిన వాల్ జడ వలపు పాశమని బెదిరితిలే మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే తెలుపక తెలిపే అనురాగము నీ కనులనే కనుగొంటిలే నీ మనసు నాదనుకొంటిలే మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి